Gold Rate: బంగారం భగభగ.. ఒక్కరోజే రూ.1200 పెరుగుదల.. ఆగస్టు 1st భయాలే కారణమా..! ఇంకెంత పెరుగుతుంది.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా..

బంగారం ధర భగభగ మండిపోతుంది. మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఆలోచన చేయాలంటేనే భయపడే స్థాయికి గోల్డ్ రేటు దూసుకెళ్తుంది.

Gold

Gold Rate: బంగారం ధర భగభగ మండిపోతుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ఆలోచన చేయాలంటేనే భయపడే స్థాయికి గోల్డ్ రేటు దూసుకెళ్తుంది. ఇప్పటికే తులం గోల్డ్ రేటు రూ. లక్ష దాటగా.. మరికొద్ది రోజుల్లో సరికొత్త రికార్డులను నమోదు చేసే దిశగా బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1140 పెరిగింది. 22 క్యారట్ల బంగారంపై రూ. 1,050 పెరిగింది. గడిచిన కొద్దికాలంలో ఒకేరోజు ఈస్థాయిలో గోల్డ్ రేటు ఎప్పుడూ పెరగలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై రెండు డాలర్లు పెరిగి.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,390 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.2వేలు పెరిగింది.

ఆగస్టు 1st భయాలే కారణమా..?
అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలు తేదీ ఆగస్టు 1వ తేదీ డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి బంగారం సేఫ్ హెవెన్ డిమాండ్ కు ఊతమిచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దేశీయ పండుగల డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ-కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మోర్ తెలిపారు. మరోవైపు.. బలహీనమైన యూఎస్ డాలర్, భౌగోళిక రాజకీయ నష్టాలు, బలమైన పెట్టుబడిదారుల డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కొనసాగడం వంటి కారణాలతో మరికొద్ది రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,850కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,01,290కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,000కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,440 కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,850 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,01,440కు చేరింది

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,28,000కు చేరుకుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,18,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,28,00కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.