Gold
Gold And Silver Price: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. దీంతో సరికొత్త రికార్డులను బంగారం ధర నమోదు చేస్తుంది. బంగారం ధరల దూకుడు ఇదేమాదిరి కొనసాగితే మరికొద్ది రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.90వేల మార్క్ ను దాటే అవకాశాలు ఉన్నాయి.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర స్వల్పంగా పెరగ్గా.. వెండి ధర భారీగా పెరిగింది. 10గ్రాముల బంగారంపై రూ. 100 పెరగ్గా.. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,870 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,690 కాగా.. 24 క్యారట్ల ధర రూ.88,020 వద్ద కొనసాగుతుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 80,550 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,870 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై వెయ్యి పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,000కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000గా నమోదైంది.