Gold Rate: గోల్డ్ రష్.. ఆల్‌టైం రికార్డు కొట్టిందిగా.. తులం రేటు ఎంతంటే..

అంతర్జాతీయ మార్కెట్లో బలమైన ట్రెండ్ తో పాటు నగల వ్యాపారులు, రిటైలర్ల నుండి డిమాండ్ పెరగడంతో బంగారం విలువ పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Gold Rate: గోల్డ్ రష్.. ఆల్‌టైం రికార్డు కొట్టిందిగా.. తులం రేటు ఎంతంటే..

Gold And Silver Price

Updated On : January 24, 2025 / 9:09 AM IST

Gold Rate: అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ధగధగమని మెరుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 82,900కు చేరింది. ఈ క్రమంలో సరికొత్త రికార్డు స్థాయికి బంగారం ధర చేరినట్లు ఆల్ ఇండియా సరాఫ్ అసోసియేషన్ (All India Sarafa Association) వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి 23 నుంచి బంగారం ధర భారీగా పెరిగింది. సుమారు రూ. 20,180 (32.17శాతం) పెరిగింది. 2024 ఫిబ్రవరి 23న 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.62,720 నుండి ప్రస్తుతం రూ. 82,900కు చేరింది.

Also Read: Gold And Silver Price: గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బలమైన ట్రెండ్ తో పాటు నగల వ్యాపారులు, రిటైలర్ల నుండి డిమాండ్ పెరగడంతో బంగారం విలువ పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 75,240 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారట్ల బంగారం ధర 82,230 వద్దకు చేరింది. మరోవైపు కిలో వెండి ధర 1,03,900 వద్ద కొనసాగుతుంది.

Also Read: Gold Rate Today: హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం, వెండి ధరల వివరాలు ..
♦  హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.82,080
♦  10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,240.
♦  కిలో వెండి ధర రూ. 1,03,900.

♦  ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,390.
♦  24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 82,230.
♦  కిలో వెండి ధర రూ.96,400.
♦  ముంబయి కోల్ కతా, బెంగళూరు నగరాల్లో ..
♦  22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 75,240.
♦  24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.82,080
♦  కిలో వెండి ధర కే, 96,400
♦  చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 75,240.
♦  24 క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 82,080.
♦  కిలో వెండి ధర రూ. 1,03,900.