Gold
Gold Rate Today: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ వివాదం సర్దుమణుగుతున్న నేపథ్యంలో గోల్డ్ రేటుకూడా తగ్గుతోంది. ఇన్నాళ్లు బంగారం ధర ఆకాశమేహద్దుగా దూసుకెళ్లడంతో.. బంగారం కొనుగోలు అంటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోయారు. తాజాగా.. పెళ్లిళ్ల సీజన్ షురూ అయిన నేపథ్యంలో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టడం మహిళలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ.220 తగ్గగా.. 22క్యారట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. అయితే, కొద్దిరోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో గడిచిన పది రోజుల్లో 24క్యారట్ల బంగారంపై రూ. 5,678 తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,510 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,700 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,660కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 87,550 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,510కు చేరుకుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,09,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,000 వద్దకు చేరింది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.