Gold
Gold And Silver Price Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా.. పలు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. ఇందులో భారతదేశంపై 26శాతం సుంకాలను ట్రంప్ విధించారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ తాజా నిర్ణయం బంగారం ధరలపైనా ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ఉదయం ఔన్సు గోల్డ్ రేటు 3,145 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒక దశలో 3,167 డాలర్ల వద్దకు వెళ్లి సరికొత్త గరిష్టాన్ని తాకింది. మరో వారంరోజుల్లో ఔన్సు గోల్డ్ రేటు 3,200 డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలోనూ గోల్డ్ రేటు పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ.540 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.500 పెరుగుదల చోటు చేసుకుంది. గడిచిన తొమ్మిది రోజుల్లో 10గ్రాముల బంగారంపై సుమారు రూ.4వేలకు పైగా పెరిగింది. అయితే, వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండిపై ఇవాళ రూ.2వేలు తగ్గింది.
బంగారం, వెండి ధరల్లో భారీ మార్పుల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.85,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.93,380 మార్క్ కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.93,530 మార్క్ కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 85,600 కాగా.. 24క్యారెట్ల ధర రూ.93,380కి చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,12,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,12,000 వద్ద కొనసాగుతుంది.