బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మళ్లీ 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష స్థాయిని దాటి వెళ్లే దిశగా వెళుతోంది. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.2,500పెరిగి, రూ.90,250గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,730 పెరిగి రూ.98,460గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,040 పెరిగి రూ.73,840గా ఉంది.
Also Read: ఇండియన్ లేడీ జేమ్స్‌బాండ్.. 1971 యుద్ధం వేళ.. ఆమె పాక్ వెళ్లి మరీ..
ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 పెరిగి రూ.90,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,730 పెరిగి రూ.98,610గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,050 పెరిగి 73,970గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.2,500పెరిగి, రూ.90,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,730 పెరిగి రూ.98,460గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,040 పెరిగి రూ.73,840గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం రూ.100 తగ్గుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.