Gold Rates
Gold Price Today: భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గురువారం రాత్రి పాకిస్థాన్ భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అయితే, భారత ఆర్మీ పాక్ డ్రోన్లను సమర్ధవంతంగా ఎదుర్కొని కూల్చివేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నవేళ భారత్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. నాలుగు రోజులుగా భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,250 తగ్గగా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.1,150 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగినప్పటికీ భారత్ లో మాత్రం బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ తగ్గుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో శుక్రవారం గోల్డ్ రేటు పెరిగింది. బంగారం ఔన్సు (31.10గ్రాముల) 23డాలర్లు పెరిగి 3,327డాలర్లకు చేరింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.90,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,350 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,500కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 90,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.98,350కు చేరుకుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,11,000 వద్ద కొనసాగుతుంది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.