Gold Price Today : మళ్లీ మొదటికొచ్చింది..! హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..

పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం మంచి సాధనం. దీంతో బంగారం కొనుగోలుకు..

Gold And Silver Price Today

Gold And Silver Price Today : పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం మంచి సాధనం. దీంతో బంగారం కొనుగోలుకు పేద వర్గాల ప్రజల నుంచి ఉన్నత వర్గాల ప్రజల వరకు బంగారం కొనుగోలుకు ఆసక్తిచూపుతుంటారు. అయితే, ప్రస్తుతం బంగారం ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. గత నెల ప్రారంభంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత బంగారం, వెండి ధరలు అమాంతం తగ్గాయి. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లకు ప్రజలు క్యూ కట్టారు. అయితే, ఉన్నట్లుంటి మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.70,310.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,600 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,460.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,450 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,310.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,310 వద్ద కొనసాగుతుంది.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 88,100.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.88,100.
    కోల్ కతా, ఢిల్లీ, ముంబయిలో కిలో వెండి ధర రూ. 83,100 వద్ద కొనసాగుతుంది.
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 80,650 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు