Today Gold Price : ఈ ఏడాది 13శాతం పెరిగిన గోల్డ్ ధర.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold and silver Price

Today Gold and Silver Rate: బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారా? అయితే మీకు కాస్త ఊరట కలిగించే విషయం. బంగారం ధర తగ్గింది. రెండు రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ధర ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 490 తగ్గింది. దీనికితోడు వెండిధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 800 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,300కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,510 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,660.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510 వద్దకు చేరింది.
– చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 400, అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,900కు తగ్గగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.63,160కు తగ్గింది.

 

తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆదివారం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 800 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,700కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,700. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.77,700కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.75,500 వద్ద కొనసాగుతోంది.

 

2023లో 13శాతం పెరిగింది..
భారతదేశంలో 2023 సంవత్సరంలో బంగారం ధర 13శాతం పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందుకు పలు కారణాలను సూచిస్తున్నారు. ఇందులో ప్రధాన కారణాలను పరిశీలిస్తే..
1) ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, అమెరికా, స్విట్జర్లాండ్‌లలో బ్యాంకింగ్ రంగంలో ప్రతికూల పరిస్థితులు, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం.
2) బ్యాంకుల్లో బంగారం నిల్వలు పెరగడం. దాంతో దిగుమతులపై ఆధారపడడం.
3) పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టడం
4) బంగారాన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో వాడడం.
5) బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణాన్ని తీసుకోవడం.
6) ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి నెలకొనడం.

బంగారంపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయని ప్రజలు నమ్ముతున్నారు.. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో కొత్త ఏడాది పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వారు బంగారంలో పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు