Gold And Silver Price Today
Gold and Silver Price Today : బంగారం అంటే ఇష్టపడనివారు ఉండరు. అది కేవలం అలంకరణకు ఉపయోగపడే వస్తువేకాదు.. సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ కూడా.. దీంతో పేద, ధనిక అనే తేడా లేకుండా బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. అయితే, గత పదిరోజుల ముందువరకు బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75వేలకు చేరింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 6శాతానికి తగ్గించారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టారు. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 60వేల మార్క్ కు చేరింది. పదిరోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో మధ్య తరగతి ప్రజలుసైతం బంగారం కొనుగోళ్లకు ఆసక్తిచూపారు. మరో రెండుమూడు నెలలపాటు బంగారం, వెండి ధరలు తగ్గుతాయని నిపుణులుసైతం అంచనా వేశారు.
అయితే, గత రెండు రోజులుగా ఉన్నట్లుండి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 870పెరగగా.. గురువారం రూ.540 పెరిగింది. వెండి ధరసైతం పెరుగుతుంది. బుధవారం కిలో వెండిపై రూ. 2వేలు పెరగ్గా.. ఇవాళ రూ. 700 పెరిగింది. దీంతో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, బంగారం, వెండి ధరలు పెరుగుదల ఇలానే కొనసాగుతుందా.. మళ్లీ తగ్గుముఖం పడతాయా అనే విషయంపై నిపుణులుసైతం సరియైన అంచనా వేయలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..