Gold Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold And Silver Price Today

Gold And Silver Price Today : గత రెండు రోజులుగా బంగారం ధర భారీగా పెరిగింది. గురు, శుక్రవారాల్లో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 1,030 పెరిగింది. అయితే, శనివారం మాత్రం ధర తగ్గింది. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 870 తగ్గింది. దీంతో బంగారం కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. మరోవైపు వెండిధరసైతం భారీగా తగ్గింది. గత రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 3వేలు పెరగ్గా.. శనివారం ఒక్కరోజే కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో ఇవాళ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,380.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,500 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,530.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,350 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,380.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,950 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,040.

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 96,500.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
  • చెన్నైలో కిలో వెండి రూ.96,500.
    కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.92,000.
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92,950 వద్ద కొనసాగుతుంది.

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు