Gold
Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ లో మహిళలకు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం కాస్తైనా కొనే సంప్రదాయం ఉంది. దీంతో పండుగలైనా.. శుభకార్యాలైనా బంగారం కొనటానికి మహిళలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,960కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 62,110కి చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,800కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,960 కు చేరింది.
– చెన్నైలో గోల్డ్ ధర పెరిగింది. 10 గ్రాములపై రూ. 50 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.57.050 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,250 వద్దకు చేరింది.
తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధరలు తగ్గాయి. కిలో వెండిపై రూ.500 తగ్గింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.74,600 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి రూ.73,750 వద్ద కొనసాగుతుంది.