Gold Price Today: పసిడి ప్రియులకు శభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..

Gold price
Gold and Silver Prices: గత మూడు నెలల క్రితం రూ.60వేలు దాటిన బంగారం ధర క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50వేలకు చేరువలో ఉంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో గోల్డ్ ధరలు భారీగా తగ్గడంతో బంగారం కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 600 తగ్గగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ పై రూ. 660 మేర తగ్గుదల చోటు చేసుకుంది. వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 2వేలు తగ్గుదల చోటు చేసుకుంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. బుధవారం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 52,600కు దిగివచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 57,380కి పడిపోయింది.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 52,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 57,530కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.52,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.57,710 కి పడిపోయింది. ఇక బెంగళూరు, కోల్‌కత్తా, ముంబయి వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 52,600కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 57,380 వద్ద కొనసాగుతోంది.

gold
తగ్గిన వెండి ధర..
దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 2000 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 73,500 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,500 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో రూ. 71,000కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ. 69,000కు పడిపోయింది.