Gold Prices
Gold Price Target : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు మళ్లీ పెరగబోతున్నాయి. రోజురోజుకీ గోల్డ్ ధరలు పైపైకి ఎగసిపడుతున్నాయి. బంగారం ధరల పెరుగుదలతో మధ్యతరగతి వాళ్లు గోల్డ్ కొనాలంటేనే బాబోయ్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధరలు పెరిగాయి అంటుంటే బంగారం ఏకంగా రూ. 2లక్షలు దాటేయనుందంటూ ఓ సంచలన రిపోర్టు కొనగోలుదారులను మరింత షాకింగ్‌కు గురిచేస్తోంది.
ఒకవైపు ప్రపంచ ఉద్రిక్తతలతో బంగారం ధరలు పెరుగుతుపోతున్న (Gold Prices) క్రమంలో భవిష్యత్తులో గోల్డ్ ధర రూ. 2 లక్షలు దాటేస్తుందనే అంచనాలు బంగారం ప్రియులను కలవరపెట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితమే రూ.80వేల దాటిన తులం బంగారం ధర ఇప్పుడు రూ.లక్ష దాటేసింది.
ఈ పరిస్థితుల్లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ బంగారం ధరలపై భారీ అంచనాలను పెంచేశారు. తాజా విశ్లేషణలో ఆయన బంగారం ధరలు సమీప భవిష్యత్తులో రికార్డు స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేశారు. నివేదిక ప్రకారం.. ప్రస్తుత బుల్ రన్ కొనసాగితే.. సమీప భవిష్యత్తులో అమెరికాలో బంగారం ధర ఔన్సుకు 6,600 డాలర్లు దాటొచ్చనని క్రిస్ వుడ్ అంచనా వేశారు.
Gold Prices
అంటే.. బంగారం ఒక ఔన్సుకు 6,600 డాలర్లు (సుమారు రూ. .5,81,205లక్షలు)కి చేరుకోవచ్చు. ఒక ఔన్సు బంగారం 28.3495 గ్రాములు అయితే గ్రాము ధర సుమారు రూ.20,500 ఉంటుంది. 10 గ్రాముల ధర రూ.2,05,000కు పెరుగుతుంది. అదేగానీ జరిగితే భారతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, తులం బంగారం ధర రూ. 2 లక్షలు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత 20 ఏళ్లలో అనేక సార్లు క్రిస్ వుడ్ బంగారం ధరలపై అంచనాలు వేశారు. 2002లో 3,400 డాలర్లు, 2005లో 3,700 డాలర్లు, 2016లో 4,200 డాలర్లు, 2020లో 5,500 డాలర్లు కాగా ఇప్పుడు 6,600 డాలర్లతో ఆయన కొత్త అంచనా షాకింగ్ గురిచేస్తోంది. గ్రీడ్ అండ్ ఫియర్ రిపోర్టులో జెఫరీస్‌కు చెందిన క్రిస్ వుడ్ ఈ అంచనాలను వెల్లడించారు.
చివరి ర్యాలీ జనవరి 1980లో కనిపించగా, అప్పుడు బంగారం ధర ఔన్సుకు 850 డాలర్లు (సుమారు రూ. 70,550) పలికింది. యూఎస్ డిస్పోజబుల్ ఆదాయంలో 9.9శాతం వాటా ఉందని పేర్కొంది. ఆ సమయంలో తలసరి ఆదాయం 8,551 డాలర్లు (సుమారు రూ.7.10 లక్షలు)గా ఉంది. అమెరికాలో పెరుగుతున్న తలసరి ఆదాయం బంగారం ధర ఔన్సుకు 3,437 డాలర్లకు చేరుకుంటుందని అప్పట్లోనే క్రిస్ వుడ్ అంచనా వేశారు. ఇప్పుడా లక్ష్యం దాటింది.
ఇప్పుడు పరిస్థితి ఏంటి? :
నివేదిక ప్రకారం.. బంగారం ప్రస్తుత ధర ఔన్సుకు 3,670 డాలర్లు (రూ. 3.04 లక్షలు), ప్రస్తుత యూఎస్ తలసరి ఆదాయం 66,100 డాలర్లు (రూ. 54.86 లక్షలు)లో దాదాపు 5.6శాతాన్ని సూచిస్తుంది. ఈ నిష్పత్తి మళ్ళీ 9.9శాతానికి చేరుకుంటే బంగారం 6,571 డాలర్లు (రూ.5.46 లక్షలు)కి చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు.
దీని ఆధారంగా, 6,600 డాలర్ల స్థాయి (రూ. 5.47 లక్షలు) చేరుకుంటుందని జెఫరీస్ అంచనా. ఔన్సు బంగారం సమారు 31.1 గ్రాములకు సమానం. గత వారమే బంగారం ఔన్సుకు 3,700 డాలర్లు (రూ. 3.06 లక్షలు)కి చేరుకుంది. డిసెంబర్ 2002లో జెఫరీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది. ఆ సమయంలో, సంస్థ బంగారం దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఔన్సుకు 3,400 డాలర్లు (రూ.2.82 లక్షలు)గా నిర్ణయించింది.
జెఫరీస్ మొదట డిసెంబర్ 2002లో బంగారం ధరలపై దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ సమయంలో 1980లో బంగారం గరిష్ట ధర 850 డాలర్లు (రూ. 70,550) ఆధారంగా ఉన్నాయి. జనవరి 1980 నుంచి యూఎస్ వ్యక్తిగత ఆదాయంలో 6.3శాతం వార్షిక వృద్ధి రేటుతో బంగారం సంభావ్య ధర 3,437 డాలర్లు (రూ.2.85 లక్షలు)గా లెక్కించారు. ఆ తరువాత జనవరి 2005లో 3,700 డాలర్లు (రూ.3.06 లక్షలు)కి అప్‌డేట్ చేశారు. సెప్టెంబర్ 2007లో జెఫరీస్ మొత్తం వ్యక్తిగత ఆదాయానికి బదులుగా తలసరి డిస్పోజబుల్ ఆదాయాన్ని ఉపయోగించి గణన నమూనాను సవరించింది.
Gold Prices
ఈ అంచనా ప్రస్తుత ధోరణులపై మాత్రమే కాకుండా గత 40 సంవత్సరాల ఆర్థిక ధోరణులపై కూడా ఆధారపడి ఉంటుంది. బంగారం ధర యూఎస్ ఆదాయంతో దగ్గరి సంబంధం కలిగి ఉందని జెఫరీస్ విశ్వసిస్తున్నారు. యూఎస్ ఆదాయాలు బాగా పెరిగినప్పుడల్లా, బంగారం ధర కూడా పెరిగింది.
భారత్, ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం :
భారత మార్కెట్లో బంగారం పెట్టుబడి, ఆభరణాలు, పండగలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుత స్థాయిలలో బంగారం ధరలు ఔన్సుకు 6,600 డాలర్లు (రూ. 5.47 లక్షలు)కి చేరుకుంటే.. భారత మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. అమెరికాలో ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 3,600 వద్ద ఉంది. భారత్‌లో 10 గ్రాముల ధర రూ.1,12,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో గోల్డ్ ధరలు ఔన్సుకు 6,600 డాలర్లకు చేరితే దాని ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్‌పై పడుతుంది.
దీని ఫలితంగా భారతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా రూ. 2 లక్షలు దాటొచ్చునని నిపుణులు అంచనా. ఫెడరల్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందే ఈ వారం బంగారం ధర ఔన్సుకు 3,700 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలపై క్రిస్ వుడ్ అంచనాలు పెట్టుబడిదారుల్లో మరింత ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి.