Reliance Jio : జియో యూజర్లకు పండగే.. కేవలం రూ.349కే స్పెషల్ ప్లాన్.. 300GB వరకు హైస్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్, OTT బెనిఫిట్స్..!
Reliance Jio : జియో యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో ఎక్కువగా డేటా పరమైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

Reliance Jio
Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగానికి 300GB వరకు డేటాను అందిస్తుంది. అంతేకాదు.. జియో OTT బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో నుంచి 300GB వరకు డేటా, OTTతో ప్లాన్ల ధరలు రూ. 349 నుంచి ప్రారంభమవుతాయి.
జియో తమ యూజరలకు వివిధ రకాల ప్రీపెయిడ్ (Reliance Jio) ప్లాన్‌లను అందిస్తుంది. అలాగే, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు (జియోప్లస్ ప్లాన్‌లు) కూడా అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లు ఇంటర్నెట్ వినియోగానికి 300GB వరకు డేటాను అందిస్తాయి. ఈ ప్లాన్‌లలో OTT బెనిఫిట్స్ అత్యంత ఆకర్షణంగా ఉన్నాయి. జియో ఏయే ప్లాన్లపై ఎలాంటి డేటా బెనిఫిట్స్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జియో ప్లస్ ప్లాన్ రూ. 349 :
ఈ జియో ప్లాన్ ఇంటర్నెట్ వినియోగానికి 30GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ జియో టీవీ, జియో హాట్‌స్టార్‌లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
జియో రూ. 449 ప్లాన్ :
ఇంటర్నెట్ ఎక్కువగా వాడే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్.. 75GB డేటా పొందవచ్చు. అదనంగా 3 ఫ్యామిలీ సిమ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. మీరు జియో టీవీ, జియో హాట్‌స్టార్‌లకు ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చు.
జియో రూ. 649 ప్లాన్ :
ఈ జియో ప్లస్ ప్లాన్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. కంపెనీ రోజుకు 100 ఉచిత SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. మీరు జియో హాట్‌స్టార్, జియో టీవీకి కూడా యాక్సెస్ పొందవచ్చు.
జియో రూ. 749 ప్లాన్ :
ఈ జియో ప్లాన్ 100GB డేటాతో వస్తుంది. 3 అదనపు సిమ్‌ల ఆప్షన్ కూడా అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS పొందవచ్చు. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్ యాక్సస్ పొందవచ్చు. జియో టీవీ కూడా ఈ ప్లాన్‌లో పొందవచ్చు.
జియో రూ. 1549 ప్లాన్ :
ఈ జియో ప్లాన్ 300GB డేటాతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో హాట్‌స్టార్, జియో టీవీ, నెట్‌ఫ్లిక్స్ (మొబైల్), అమెజాన్ ప్రైమ్ లైట్ యాక్సెస్ కూడా ఉన్నాయి. అన్ని ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా అందిస్తుంది. అర్హత కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది.