Amazon Great Indian Festival Sale : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గిందోచ్.. అమెజాన్ సేల్ కన్నా ముందే కొనేసుకోవచ్చు..!

Amazon Great Indian Festival Sale : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర భారీగా తగ్గింది. అమెజాన్ సేల్‌కు ముందే ఈ మ్యాక్ ల్యాప్‌టాప్ కొనేసుకోవచ్చు.

Amazon Great Indian Festival Sale : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గిందోచ్.. అమెజాన్ సేల్ కన్నా ముందే కొనేసుకోవచ్చు..!

Apple MacBook Air M4 Deal

Updated On : September 20, 2025 / 7:07 PM IST

Amazon Great Indian Festival Sale : కొత్త ఆపిల్ మ్యాక్ ల్యాప్‌‌టాప్ కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు ముందే భారీ ధర తగ్గింపుతో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 85వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

ఆకర్షణీయమైన ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు (Amazon Great Indian Festival Sale) వదులుకోవద్దు. ఈ మ్యాక్ ల్యాప్‌టాప్‌లో రైటింగ్, ఫోటో ఎడిటింగ్ నుంచి గేమింగ్, వీడియో రెండరింగ్ వరకు ఎలాంటి లాగ్ ఉండదు. 11.3mm సన్నగా కేవలం 1.24కిలోగ్రాముల బరువు ఉంటుంది. రోజువారీ ప్రయాణికులకు పోర్టబుల్‌గా ఉంటుంది. M4 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ 2025 కొనుగోలుపై ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M4 డీల్ :
మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌‌టాప్ అసలు ధర రూ.99,900గా ఉంటే.. ఆసక్తిగల కొనుగోలుదారులు ప్రస్తుతం రూ.83,990కే కొనుగోలు చేయొచ్చు. రూ.15,910 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, కొనుగోలుదారులు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,750 ఆదా చేసుకోవచ్చు.

Read Also : Flipkart Big Billion Days Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఆర్డర్ చేయండి.. ఆపిల్ ఐఫోన్ 17 కేవలం 10 నిమిషాల్లోనే హోం డెలివరీ..!

దాంతో అసలు ధర నుంచి రూ.82,240 వరకు పొందవచ్చు. ఇంకా, కొనుగోలుదారులు పాత ల్యాప్‌‌టాప్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.4,100 వరకు ట్రేడ్-ఇన్ ఆఫర్ పొందవచ్చు.ఇంకా, రిటైలర్ల వద్ద నెలకు రూ. 4,072 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ, ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్పెసిఫికేషన్లు :
13-అంగుళాలు, 15-అంగుళాలు అనే రెండు సైజులలో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ల్యాప్‌టాప్ అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ కలిగి ఉంది. లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ మ్యాక్ ల్యాప్‌‌టాప్ మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్, రెండు థండర్‌బోల్ట్ పోర్ట్‌లకు సపోర్టు ఇస్తుంది. 12MP సెంటర్ స్టేజ్ కెమెరా కూడా కలిగి ఉంది. ఫ్రేమ్‌ ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది. వీడియో కాల్స్ ఈజీగా చేయొచ్చు.

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 లేటెస్ట్ సిరి అప్‌డేట్‌లతో వస్తుంది. వినియోగదారులు వాయిస్, టెక్స్ట్ కమాండ్‌ల మధ్య ఈజీగా మారొచ్చు. మీరు సిరిని వేలాది మ్యాక్స్ సంబంధిత ప్రశ్నలను అడగవచ్చు. దశల వారీగా గైడ్‌‌లైన్స్ కూడా ఉంది. సిరి, రైటింగ్ టూల్స్‌లో ChatGPT ఇంటిగ్రేషన్ ద్వారా ఏఐ ఆధారిత అసిస్టెన్స్ కూడా అందిస్తుంది. 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.