Flipkart Big Billion Days Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఆర్డర్ చేయండి.. ఆపిల్ ఐఫోన్ 17 కేవలం 10 నిమిషాల్లోనే హోం డెలివరీ..!

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మినిట్స్ సర్వీసుతో ఐఫోన్ 17 కేవలం 10 నిమిషాల్లోపు డెలివరీ అవుతుంది.

Flipkart Big Billion Days Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఆర్డర్ చేయండి.. ఆపిల్ ఐఫోన్ 17 కేవలం 10 నిమిషాల్లోనే హోం డెలివరీ..!

Flipkart Big Billion Days Sale

Updated On : September 20, 2025 / 5:39 PM IST

Flipkart Big Billion Days Sale : ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొనాలని అనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సందర్భంగా 10 నిమిషాల స్మార్ట్‌ఫోన్ డెలివరీని ప్రకటించింది. ఇందులో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ S24 వంటి పాపులర్ మోడళ్లు ఉన్నాయి.

ఈ సర్వీసు ఎంపిక చేసిన నగరాల్లో భారీ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డీల్‌లతో పాటు (Flipkart Big Billion Days Sale) అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి (ప్లస్, బ్లాక్ యూజర్లకు సెప్టెంబర్ 22 నుంచి ముందస్తు యాక్సెస్‌తో) ప్రారంభం కానుంది. ఈ పండుగ సీజన్ సేల్ సమయంలో భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ మొదటిసారిగా స్పీడ్ డెలివరీ చేయనుంది.

10 నిమిషాల్లోనే ఐఫోన్ 17 డెలివరీ :

భారత మార్కెట్లో సెప్టెంబర్ 19న ఐఫోన్ 17 సిరీస్ అమ్మకానికి వచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణేలోని ఆపిల్ స్టోర్లలో ఈ ఐఫోన్ కొనేందుకు ఎగబడ్డారు. కొనుగోలుదారులు ఆపిల్ అవుట్‌లెట్‌ల వెలుపల గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ఫ్లిప్‌కార్ట్ 10 నిమిషాల డెలివరీతో స్టోర్ల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, బెంగళూరుతో సహా ఎంపిక చేసిన నగరాల్లోని కస్టమర్లు తమ ఐఫోన్ 17ను ఈ సేల్ సమయంలో 24/7 నిమిషాల్లో డెలివరీ చేసుకోవచ్చు. ఈ సర్వీసు శాంసంగ్ గెలాక్సీ S24, మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, వివో T4x 5G వంటి ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది.

Read Also : iPhone 16 Pro Max : వారెవ్వా.. ఆఫర్ అదుర్స్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు స్పెషల్ ఆఫర్ :
బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 అధికారికంగా సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులు సెప్టెంబర్ 22న ముందస్తు యాక్సెస్ పొందవచ్చు. ప్రీమియం సభ్యులు అందరికంటే ముందుగా 10 నిమిషాల డెలివరీ ఆఫర్, ప్రత్యేక డిస్కౌంట్‌లను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై బిగ్ డిస్కౌంట్లు.. లిమిటెడ్ టైమ్ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు ధృవీకరించింది.

  • ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో
  • శాంసంగ్ గెలాక్సీ S24, శాంసంగ్ గెలాక్సీ S24 FE
  • ఒప్పో K13x, రియల్‌మి P4 ఫోన్
  • పోకో F7, వివో T4x 5G, CMF నథింగ్ ఫోన్ 2 ప్రో
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, ఆపిల్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో 2, శాంసంగ్ ఫిట్ 3, రెడ్‌మి మూవ్ వేరబుల్స్, డిజిటల్ కెమెరాలు, అప్లియన్సెస్ కూడా 10 నిమిషాల డెలివరీ ద్వారా పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ :
ఈ సేల్‌ సమయంలో ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, హోం అప్లియన్సెస్‌‌లపై బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఇన్‌స్టంట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ డీల్స్ వినియోగదారులు సరసమైన ధరలకు ప్రీమియం ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 దీపావళి వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ సేల్ ఎప్పుడు ముగుస్తుందో అధికారిక తేదీని వెల్లడించలేదు.