iPhone 16 Pro Max : వారెవ్వా.. ఆఫర్ అదుర్స్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!
iPhone 16 Pro Max : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 19వేలకుపైగా తగ్గింపు పొందింది.

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ.1,44,900 నుంచి రూ.1,29,000కి తగ్గింది. అదనంగా రూ.7,500 HSBC బ్యాంక్ ఆఫర్‌తో పాటు కొనుగోలుదారులకు రూ.23వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.
2024లో లాంచ్ అయిన ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ (iPhone 16 Pro Max) భారత మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర తగ్గింపు పొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ప్రీమియం ఫోన్లలో ఒకటి. ఈ డిస్కౌంట్ విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఈఎంఐతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు.
కొత్త ధర, తగ్గింపు వివరాలివే :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ (1TB స్టోరేజ్) భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.1,84,900గా ఉండేది. విజయ్ సేల్స్ ఇప్పుడు అదే ఐఫోన్ ధరను రూ.1,72,500కి విక్రయిస్తోంది. నేరుగా రూ.12,400 (7 శాతం) తగ్గింపును అందిస్తోంది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో చెల్లించే కస్టమర్‌లు అదనంగా రూ.7,500 తగ్గింపును పొందవచ్చు. దాంతో మొత్తం సేవింగ్ రూ.19,000 కన్నా ఎక్కువగానే పొందవచ్చు. ఈ డీల్ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ ముఖ్య ఫీచర్లు :
- డిస్‌ప్లే : 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED, 2868 x 1320 రిజల్యూషన్, 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్.
- ప్రాసెసర్ : ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్, 6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్
- ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ : 8GB ర్యామ్, 256GB నుంచి 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లు
- కెమెరాలు : ట్రిపుల్ రియర్ సెటప్, (48MP మెయిన్, 48MP అల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో).
- నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్, స్మార్ట్ HDR 5 ఫీచర్లు
- ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా
- బ్యాటరీ : 4,685 mAh బ్యాటరీ సపోర్టు, ఫాస్ట్ USB-C ఛార్జింగ్‌కు సపోర్టు, 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్
- డిజైన్ : టైటానియం బాడీ, IP68 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్, 227 గ్రాముల బరువు.
- సాఫ్ట్‌వేర్, కనెక్టివిటీ : iOS18 ఆపరేటింగ్, 5G, Wi-Fi 7, డైనమిక్ ఐలాండ్‌లకు సపోర్టు
ఐఫోన్ ప్రో మాక్స్ మోడళ్లపై డీల్స్ :
ఆపిల్ ఐఫోన్లలో ముఖ్యంగా ప్రో మాక్స్ మోడల్స్ అరుదుగా భారీ డిస్కౌంట్లతో లభిస్తాయి. ఐఫోన్ 16 ప్రో మాక్స్ పై రూ. 23వేలు సేవ్ చేయొచ్చు. ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక పర్ఫార్మెన్స్, రీసేల్ వాల్యూ ఉంటుంది.