Gold Limit at Home : మీ ఇంట్లో బంగారం ఉందా? బిల్లు లేకుండా ఎంత గోల్డ్ ఉంచొచ్చు? షాకింగ్ లీగల్ రూల్స్!
Gold Limit At Home : మీ ఇంట్లో బంగారం ఉంచుకున్నారా? ఇంతకీ ఆ బంగారానికి సరైన బిల్లు ఉందా? అసలు బిల్లు లేకుండా ఇంట్లో ఎంతవరకు బంగారం ఉంచుకోవచ్చు.. లీగల్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
Gold Limit At Home ( Image Credit : Gemini AI )
- బంగారం తగ్గింది కదా అని తెగ కొనేస్తున్నారా?
- మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది? లిమిట్ ఎంతో తెలుసా?
- బిల్లు లేకుండా బంగారం ఇంట్లో ఉంచుకుంటే లీగల్ సమస్యలివే
Gold Limit at Home : బంగారం.. భారతీయుల సెంటిమెంట్.. పండగలు వచ్చినా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం తెగ కొనేస్తుంటారు. అందులోనూ ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వస్తోంది. చాలామంది ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం ఎంతో కొంత కొని ఇంటికి తెచ్చేసుకుంటారు. ఈ రోజున బంగారం కొనడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
అయితే, బంగారం కొంటారు సరే.. మరి ఎంత కొనొచ్చు? ఎవరైనా ఎంతైనా (Gold Limit At Home) కొని ఇంట్లో ఉంచుకోవాచ్చా? కొంత పరిమితిలో మాత్రమే బంగారం ఉంచుకోవాలా? అసలు పరిమితికి మించి బంగారం ఉంచుకుంటే ఏమౌతుంది? చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? చాలామందికి అవగాహన ఉండదు. వాస్తవానికి భారతీయులు తమ ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి సంబంధించి కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి.
మీరు ఈ నిబంధనలను పాటించకపోతే ముఖ్యంగా నిర్దేశించిన పరిమితులకు మించి బంగారం ఇంట్లో ఉంటే మీపై చట్టపరమైన చర్యలు తప్పవు. ఇంట్లో బంగారం ఎంత ఉండాలి? ఎవరు ఎంత ఉంచుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బిల్లు లేకుండా ఒకరు ఎంత బంగారం ఉంచుకోవచ్చు:
భారత్‌లో బంగారం ఉంచుకునేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఒక నిర్దిష్ట పరిమితిని విధించింది. ఈ నిర్దిష్ట పరిమితిలో మాత్రమే ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి అనుమతి ఉంది.
Read Also : స్మార్ట్‌టీవీ లవర్స్‌కి పండగే.. షావోమీ కొత్త 4K మినీ LED టీవీలు ఇదిగో.. ఇంట్లోనే థియేటర్ ఫీల్..!
ఈ రూల్ ప్రకారం.. వివాహిత మహిళ 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. ఈ పరిమితికి మించి బంగారం దగ్గర ఉంటే చట్టవిరుద్ధం. ఒక మహిళ తన వద్ద 250 గ్రాముల బంగారం మాత్రమే ఉంచుకోవచ్చు. పురుషుల విషయానికొస్తే.. బంగారం పరిమితి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్రతి పురుషుడు 100 గ్రాముల బంగారం మాత్రమే దగ్గర ఉంచుకోవాలి.
గోల్డ్ నాణేలు, కడ్డీలు లేదా బిస్కెట్లు ఉండొచ్చా?
సీబీడీటీ రూల్ ప్రకారం.. కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీ వద్ద బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా కడ్డీలు ఉంటే.. ఈ రూల్ వాటికి వర్తించదు. ఇలాంటి సందర్భాలలో, మీరు ఆ నాణేలు లేదా కడ్డీల కోసం వ్యాలీడ్ అయ్యే అసలైన బిల్లు లేదా రసీదును తప్పనిసరిగా ఉంచుకోవాలి. బిల్లును చూపించలేకుంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మీ ఇంట్లో అధికంగా బంగారం దొరికితే ఏమవుతుంది?
మీ వద్ద నిర్దేశిత పరిమితిని మించి బంగారం దొరికితే వివరణ ఇచ్చేందుకు ఆదాయ శాఖ మీకు అవకాశం కల్పిస్తుంది. ఈ బంగారం వారసత్వంగా వచ్చిందని, బహుమతిగా అందుకుందని లేదా మీ సొంత నిధులతో కొనుగోలు చేసిందని మీరు నిరూపించాలి. మీరు ఇందుకోసం నిరూపించగలిగితే మీపై ఎలాంటి చర్యలు తీసుకోరు.
కిలోగ్రాము గోల్డ్ ఇంట్లో ఉంచుకోవచ్చా?
మీరు ప్రకటించిన ఆదాయంతో బంగారం కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఇన్వాయిస్ లేదా బిల్లు మీ వద్ద ఉంటే మీరు ఒక కిలోగ్రాము బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. మీ వద్ద ఉన్న బంగారం చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించినట్టు నిరూపించుకోవాలి. అప్పుడు ఒక కిలోగ్రాము, 5 కిలోగ్రాములు, 10 కిలోగ్రాములు లేదా మీకు కావలసినంత బంగారాన్ని మీ ఇంట్లో ఉంచుకోవచ్చు.
