Gold Price down
Gold Price down : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. మరికొద్దిరోజులు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా.. గోల్డ్ రేటు రూ.7వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. దేశీయంగా ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం రేటు రూ.3,900 క్షీణించింది. ఫలితంగా గడిచిన రెండుమూడు రోజుల్లోనే రూ.1,32,000 వద్దకు చేరుకున్న గోల్డ్ రేటు రూ.1,25,800కు పడిపోయింది. మరోవైపు వెండి రేటు కూడా కేజీకి రూ.7,800 తగ్గింది. దీంతో రూ.1,56,000కు దిగి వచ్చింది.
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడంతోపాటు ఈవారం కీలక డేటా విడుదల అనంతరం ఫెడ్ రిజర్వ్ తీసుకోబోయే చర్యల గురించి ఇన్వెస్టర్లు నిరీక్షిస్తుండటంతో బంగారం, వెండి అమ్మకాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా మార్కెట్లు చూస్తే కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ప్యూచర్స్ కాంట్రాక్ట్ ఔన్సు కు సుమారు 65డాలర్లు క్షీణించి 4,009.5 డాలర్లకు తగ్గింది. గత నాలుగు సెషన్లలో బంగారం ధర ఏకంగా 204.1 డాలర్లు క్షీణించింది. అలాగే డిసెంబర్ కాంట్రాక్టు వెండి రేటు 2.38శాతం క్షీణించి 49.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ. 1,23,650 వద్ద కొనసాగుతుంది. 22 క్యారట్ల గోల్డ్ రూ. 1,13,340 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా కిలో వెండి రేటు రూ.1,69,900 వద్ద కొనసాగుతుంది. అయితే, బంగారం, వెండి ధరలు వచ్చే వారం రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొద్ది నెలల్లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రేటు రూ.1లక్షకు దిగొచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.