గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర

  • Publish Date - April 18, 2019 / 03:07 PM IST

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా తగ్గింది. కొన్ని రోజులుగా గోల్డ్ ధర తగ్గుతూ వచ్చింది. గురువారం(ఏప్రిల్ 18,2019) మాత్రం ఏకంగా రూ.405 తగ్గింది. దేశీ మార్కెట్‌లో 10గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.405 తగ్గుదలతో రూ.32,385కు పడిపోయింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే దీనికి కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర నడిచింది. కేజీ వెండి ధర రూ.104 తగ్గుదలతో రూ.38,246కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1,278.45 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 14.95 డాలర్లకు చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.405 తగ్గుదలతో రూ.32,385కు.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.395 తగ్గుదలతో రూ.32,225కు క్షీణించింది. కేజీ వెండి రూ.104 తగ్గుదలతో రూ.38,246కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ రూ.187 క్షీణతతో రూ.37,135కు తగ్గింది.

ట్రెండింగ్ వార్తలు