పెరుగుతున్న బంగారం ధరలు

  • Publish Date - January 30, 2019 / 04:48 AM IST

హైదరాబాద్ : మళ్లీ పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడం..వ్యాపారులు..రిటైలర్లు కొనుగోలు చేస్తుండడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. న్యూఢిల్లీలో జనవరి 17వ తేదీ 22 క్యారెట్స్ రూ. 31, 750 ఉన్న ధర జనవరి 29వ తేదీకి రూ. 32, 000కి చేరుకుంది. అదే 24 క్యారెట్ జనవరి 17వ తేదీ రూ. 33, 530 ఉంటే..జనవరి 29వ తేదీ రూ. 33, 400గా ఉంది. ప్రధాన నగరంలో ఒకటైన హైదరాబాద్‌లో జనవరి 17వ తేదీ 22 క్యారెట్స్ రూ. 31, 080 ఉన్న ధర జనవరి 29వ తేదీకి రూ. 31, 340 కి చేరుకుంది. అదే 24 క్యారెట్ జనవరి 17వ తేదీ రూ. 32, 550 ఉంటే..జనవరి 29వ తేదీ రూ. 33, 500గా ఉంది. వివాహాలకు బంగారం డిమాండ్ ఉంటుండడంతో ధర పెరుగుతున్నాయని బిజినెస్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 

ఇక వెండి ధరల విషయానికి వస్తే స్వల్పంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో జనవరి 17 పది గ్రాముల ధర రూ. 415.., 100 గ్రాముల ధర రూ. 4, 150.., 1 కేజీ వెండి ధర రూ. జనవరి 29వ తేదీ 10 గ్రాముల ధర రూ. 415.., 100 గ్రాముల ధర రూ. 4, 150.., 1 కేజీ వెండి ధర రూ. 41, 500గా ఉంది. అదే జనవరి 29వ తేదీన 10 గ్రాముల ధర రూ. 415.., 100 గ్రాముల ధర రూ. 4, 150.., 1 కేజీ వెండి ధర రూ. 41, 500గా ఉంది. న్యూఢిల్లీలో జనవరి 17వ తేదీన 10 గ్రాముల ధర రూ. 415.., 100 గ్రాముల ధర రూ. 4, 150.., 1 కేజీ వెండి ధర రూ. 41, 500గా ఉంది. అదే జనవరి 29వ తేదీన 10 గ్రాముల ధర రూ. 415.., 100 గ్రాముల ధర రూ. 4, 150.., 1 కేజీ వెండి ధర రూ. 41, 500గా ఉంది. 

ట్రెండింగ్ వార్తలు