Gold price prediction : బంగారం ధరలపై బిగ్ అప్డేట్.. వచ్చే నెలలో గోల్డ్ రేటు భారీగా తగ్గబోతుందా..? నిపుణులు ఏం చెప్పారంటే.. నేటి ధరలు ఇలా..

Gold price prediction : భారతదేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బంగారం ధరలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.

Gold price prediction

Gold price prediction : భారతదేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బంగారం ధరలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. గత నాలుగు రోజులుగా గోల్డ్ రేటు పెరుగుతోంది. అయితే, భారతదేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో గోల్డ్ రేట్లు పెరుగుతాయా..? తగ్గుతాయా అనే విషయాలపై నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. (Gold price prediction)

ప్రపంచంలో రాజకీయ అనిశ్చితులు, అమెరికా విధిస్తున్న కొత్త సుంకాలు, గ్లోబల్ ట్రేడ్ టెన్షన్లు బంగారం మీద సురక్షిత పెట్టుబడిగా డిమాండ్ ను పెంచుతున్నాయి. ఈ కారణాల వల్లే బంగారం 2025లో ఇప్పటి వరకు 28శాతం రాబడి ఇచ్చింది. దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు గణనీయంగా పెరిగాయి. ఆగస్టు ఒక్క నెలలోనే 10గ్రాముల గోల్డ్ 1.6శాతం పెరిగి రూ.లక్షమూడువేల మార్కుకు చేరింది. ఇది 2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 31శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. సెప్టెంబర్ నెలలోనూ గోల్డ్ రేటు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్వల్పంగా పెరగ్గా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే..

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.94,060 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,610 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,210 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,760 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.94,060 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,02,610కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,29,900 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,19,900 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,29,900 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Also Read: Mood of the Nation : ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిది..? ఎన్డీయేకు ఎన్ని సీట్లొస్తాయి.. ఆసక్తికర సర్వే