పండుగ ముందు బంగారం కొనాలనుకుంటున్నారా? వచ్చేవారం మొత్తం ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేసే వ్యాఖ్యలపై కూడా పెట్టుబడిదారులు బాగా దృష్టి సారిస్తారు. ఇవి సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయన్న సూచనలు ఇస్తాయి.

Gold Price
Gold Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? పండుగ డిమాండ్, అమెరికా ద్రవ్యోల్బణం డేటా వచ్చే వారం పసిడి ధరలను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం ధరలు వచ్చే వారం వోలాటైల్‌గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంటే.. మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉండవు. ధరలు త్వరగా పెరగడం లేదా తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.
ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే.. ట్రేడర్లు దేశీయ పండుగ డిమాండ్, ఫిజికల్ మార్కెట్ ప్రీమియంలను మ్యాక్రోఎకనామిక్ డేటా విడుదల, అమెరికా రాజకీయ పరిణామాలతో పోల్చుతున్నారు.
ఫెడరల్ రిజర్వ్ అధికారులు (ముఖ్యంగా చైర్మన్ జెరోమ్ పవెల్) చేసే వ్యాఖ్యలపై కూడా పెట్టుబడిదారులు బాగా దృష్టి సారిస్తారు. ఇవి సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయన్న సూచనలు ఇస్తాయి.
Also Read: వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఫస్ట్ ఏసీ కోచ్.. అబ్బబ్బ ఏముంది మామా.. వారం రోజుల్లో..
“వచ్చే వారం భారత్‌లో పండుగ సీజన్ సమయంలో బులియన్‌కు ఫిజికల్ డిమాండ్, గ్లోబల్ రాజకీయ, జియో-పాలిటికల్ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఖర్చులకు సంబంధించిన బిల్లు, రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు డిప్లొమసీ మళ్లీ ప్రారంభించే ప్రయత్నాలు వంటివి చోటుచేసుకుంటాయి.
ఈ అంశాలు వచ్చే నెలల్లో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి” అని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈబీజీ-కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ అన్నారు.
బంగారం ధరలు మరోసారి పాజిటివ్ నోట్‌తో ముగిసినప్పటికీ, వోలాటిలిటీ ఎక్కువగా ఉందని ప్రణవ్ మెర్ చెప్పారు. “ఫండమెంటల్ సైడ్ ఎక్కువగా మార్పు లేదు. అమెరికా ట్రేడ్ టారిఫ్స్ ఇంకా అమలులో ఉంటే అనిశ్చితి ఉంటుంది. చైనాపై టారిఫ్స్ విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మళ్లీ సేఫ్ హేవెన్ డిమాండ్‌ను పెంచింది” అని ఆయన అన్నారు.
గతవారం, బంగారం ధరలు రూ.3,251 (2.75) శాతం పెరిగి, గురువారం రూ.1,23,677 10 గ్రాముల వద్ద రికార్డు స్థాయికి చేరింది. అయితే, వారం ముగింపు దిశలో ఎంసీఎక్స్‌లో తాత్కాలికంగా స్థిరత్వాన్ని నమోదు చేసుకుంది.
“గత కొన్ని నెలల్లో బంగారం ధరలు బాగా పెరిగాయి. 2025లో ఇయర్-టు-డేట్ 50 శాతం పైగా లాభంతో ఉంది. ఇది గురువారం నికర లాభాలను తీసుకోవడానికి ప్రేరేపించింది. రూ.1,23,677 నుంచి రూ.3,000 కంటే ఎక్కువ ధర కరెక్షన్ ప్రారంభమైంది. ఇది బంగారం వోలాటిలిటీకి కారణమైంది” అని మరో నిపుణుడు తెలిపారు.
ఆసియాలో ఫిజికల్ డిమాండ్ గత వారం తగ్గింది. ధరల పెరుగుదల వల్ల బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ముఖ్యంగా చైనా, భారత్‌లో ఇంపోర్ట్ ప్రీమియంలు తగ్గాయి. స్వల్పకాలిక అవుట్‌లుక్ ఇప్పుడు రాబోయే అమెరికా ద్రవ్యోల్బణం రీడింగ్స్, ఫెడరల్ రిజర్వ్ అధికారులు వ్యాఖ్యలపై ఆధారపడుతుందని విశ్లేషకులు తెలిపారు.