వందే భారత్‌ స్లీపర్ ట్రైన్.. ఫస్ట్ ఏసీ కోచ్‌.. అబ్బబ్బ ఏముంది మామా.. వారం రోజుల్లో..

ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్‌మెంట్‌ ఎగ్జిబిషన్ (IREE) - 2025లో కినెట్ రైల్వే సొల్యూషన్స్ ఫస్ట్ ఏసీ కాంపార్ట్మెంట్ డిజైన్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించనుంది.

వందే భారత్‌ స్లీపర్ ట్రైన్.. ఫస్ట్ ఏసీ కోచ్‌.. అబ్బబ్బ ఏముంది మామా.. వారం రోజుల్లో..

Vande Bharat Sleeper train

Updated On : October 12, 2025 / 7:18 PM IST

Vande Bharat Sleeper train: ఇండో-రష్యన్ జాయింట్‌ వెంచర్ “కినెట్ రైల్వే సొల్యూషన్స్” వచ్చే వారం ఫస్ట్ ఏసీ కాంపార్ట్మెంట్ డిజైన్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.

రైల్వే శాఖ సుదీర్ఘ దూరాల మధ్య ప్రయాణాలు చేసేవారి కోసం వందే భారత స్లీపర్ ట్రైన్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్‌మెంట్‌ ఎగ్జిబిషన్ (IREE) – 2025లో కినెట్ రైల్వే సొల్యూషన్స్ ఫస్ట్ ఏసీ కాంపార్ట్మెంట్ డిజైన్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించనుంది. వచ్చే వారం ఢిల్లీ భారత్ మండపంలో ఈ ప్రదర్శన జరుగుతుంది.

Also Read: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ గౌడ్‌కు నేను ఫిర్యాదు చేయలేదు.. ఏం జరిగిందంటే..? సీతక్క

రష్యా రోలింగ్ స్టాక్ కంపెనీలతో రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (RVNL) కలిసి కినెట్ రైల్వే సొల్యూషన్స్‌ను స్థాపించారు. భారత రైల్వే కోసం 120 వందే భారత స్లీపర్ ట్రైన్ల(1,920 కోచ్‌లు) తయారీ, నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ చూసుకుంటుంది. మొదటి ప్రోటోటైప్‌ను 2026 జూన్‌లో ప్రదర్శిస్తారు.

వందే భారత స్లీపర్ ట్రైన్లను తయారు చేయడం కోసం మూడు కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అవే బీఈఎంఎల్‌, కినెట్ రైల్వే సొల్యూషన్స్, టిటాగర్ రైల్వే సిస్టమ్స్ లిమిటెడ్-బీహెచ్‌ఈఎల్‌ కన్సార్షియం.

ఒకేసారి 2 వందే భారత స్లీపర్ ట్రైన్ల ప్రారంభోత్సవం
రైల్వే శాఖ 2 వందే భారత స్లీపర్ ట్రైన్లను ఒకేసారి ప్రారంభించనుంది. గత నెల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని తెలిపారు. “ప్రస్తుతం రెండో ట్రైన్ తయారవుతోంది. 2025 అక్టోబర్ 15 వరకు సిద్ధమవ్వచ్చు. రెండు ట్రైన్లను ఒకేసారి ప్రారంభిస్తాము. రెండవ రేక్ కోసం ఎదురుచూస్తున్నాము. ఆ తర్వాత ఏ రూట్ ఎంచుకోవాలి? అన్న నిర్ణయాన్ని తీసుకుంటాము” అని వైష్ణవ్ తెలిపారు.