Minister Seethakka: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ గౌడ్‌కు నేను ఫిర్యాదు చేయలేదు.. ఏం జరిగిందంటే..? సీతక్క

"వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్‌ను కోరాను" అని అన్నారు.

Minister Seethakka: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ గౌడ్‌కు నేను ఫిర్యాదు చేయలేదు.. ఏం జరిగిందంటే..? సీతక్క

Seethakka

Updated On : October 12, 2025 / 4:54 PM IST

Minister Seethakka: మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ గౌడ్‌కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటనలో వివరాలు తెలిపారు.

“సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియాలో వ‌చ్చిన‌ వార్తల‌ను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాను.

Also Read: అందుకే మిమ్మల్ని తైతక్కల రోజా అనాల్సి వస్తోంది: పంచుమర్తి అనురాధ

వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్‌ను కోరాను. ఆదివాసి వీర వనితలు సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల చుట్టూ ఏ చిన్న పాటి వివాదం ఉండకూడదన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లాను.

ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవి. వాటి చుట్టూ ఎలాంటి అపార్థాలు లేకుండా, పనులు సజావుగా పూర్తి కావాలి. సున్నితమైన అంశం కావడంతో, వీలైనంత త్వరగా అపార్థాలు తొలగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగేలా చూడాలని కోరాను.

అంతే తప్ప నేను ఎవరి మీద పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేయలేదు. మేడారం ఆలయం అభివృద్ధి మన అందరి బాధ్యత. పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నాం” అని మంత్రి సీతక్క తెలిపారు.