Gold Rate: పుత్తడి పరుగు.. 91వేలకు చేరిన బంగారం ధర.. ఇంకా పెరుగుతుందా..?
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Gold
Gold Rate: బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. బులియన్ మార్కెట్‌లో పసిడి ధర 91 వేల మార్క్‌కు చేరుకోగా.. వెండి లక్షా 10వేల మార్క్ దాటి పరుగులు తీస్తోంది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బుధవారం ఉదయం ఔన్స్ గోల్డ్ ధర 3,035 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర రూ.34.02 డాలర్లుగా ఉంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.1,13,000కు చేరింది.
ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు రూ.500 పెరిగి మరో రికార్డు గరిష్ఠ స్థాయి రూ.91,250 చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. విదేశాల్లో బలమైన ట్రెండ్ కారణంగా స్టాకిస్టులు, రిటైలర్లు నిరంతరం కొనుగోళ్లు జరపడమే ఇందుకు కారణమని పేర్కొంది. అమెరికాలో మాంద్యం భయాలు, ట్రంప్ ప్రభుత్వ విధానాలతో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని, పరిస్థితి ఇలానే కొనసాగితే ఈనెల చివరినాటికి గోల్డ్ రేటు రూ.95వేల మార్క్ ను చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.