Gold Price Today
Gold Price Today : ఇన్నాళ్లు బంగారం పేరెత్తితేనే పేద, మధ్య తరగతి ప్రజలకు వణుకు పెట్టేది.. అయితే, ప్రస్తుతం వెండి పేరు విన్నా అదేపరిస్థితి ఎదురవుతోంది. బంగారం ఒకపక్క రికార్డుల మోత మోగిస్తుంటే.. మరోపక్క వెండి రేటు అంతకన్నా ఎక్కువ రికార్డులనే నమోదు చేస్తోంది. చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూలేని స్థాయిలో వెండి రేటు దూసుకెళ్తోంది.
బంగారం ధరలు ఇటీవల కాలంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అదే స్థాయిలో వెండి రేటు కూడా పరుగులు పెడుతోంది. ఇవాళ (సోమవారం) ఒక్కరోజు కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. ఇక పది రోజుల్లో వెండి ధర ఎంత పెరిగిందో తెలుస్తే మీకు మెంటెక్కిపోవాల్సిందే..! గడిచిన 10రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ.35వేలు పెరిగిందంటే.. ఏ స్థాయిలో వెండి రేటు దూసుకెళ్తుందో అర్ధంచేసుకోవచ్చు.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.320 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 300 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 40 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,057 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు.. వెండి ధర సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఇవాళ వెండి రూ.5వేలు పెరిగింది. దీంతో కిలో వెండిపై రూ.1.95లక్షలకు చేరింది. మరో రెండు రోజుల్లో వెండి రేటు రూ.2లక్షలకు చేరేందుకు సిద్ధమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,14,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,25,400కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,25,550కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,14,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,25,550కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,95,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,85,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,95,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.