Gold Price Today
Gold Price Today : బంగారం కొనుగోలు చేస్తున్నారా..? బంగారం కొనుగోలుపై నిపుణులు కీలక సూచనలు చేశారు. అంతర్జాతీయంగా కామెక్స్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 4వేల డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. ఈ స్థిరత్వం బంగారం పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన సంకేతం అందిస్తోంది. సురక్షిత ఆస్తుల డిమాండ్ ఇంకా బలంగానే కొనసాగుతోంది.
బంగారం కొనుగోలుదారులకు నిపుణులు కీలక సూచనలు చేశారు. యూఎస్ డాలర్ బలహీనత, రూపాయి పడిపోవడం వంటి కారణాలతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,21,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కానీ, మార్కెట్లో తాత్కాలిక అస్థిరత ఉండే అవకాశం ఉంది. దీంతో రాబోయే కొద్దిరోజుల్లో యూఎస్, భారతదేశం CPI (Consumer Price Index) డేటా, ఫెడరల్ రిజర్వ్ విధానాలు కీలకం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా బంగారం రేటు రూ. 1,18,500 నుంచి రూ.1,24,000 మధ్యగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే, ఈ స్థాయి వద్ద బంగారం కొనుగోళ్లు చేయవచ్చునని, అంతకంటే మించితే కొనుగోలు చేయడం అంత ఉత్తమం కాదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,11,840 వద్ద కొనసాగుతోంది. అయితే, గోల్డ్ రేటు రాబోయే రెండు నెలల్లో తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతోపాటు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తా అంటూ చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరికొద్ది రోజుల్లో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు వచ్చే రెండుమూడు నెలల్లో భారీగానే తగ్గే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారతదేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 18డాలర్లు పెరిగింది. దీంతో మళ్లీ ఔన్సు గోల్డ్ 4,001డాలర్లకు చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,11,840 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,22,010కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,990 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,22,160కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,11,840 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,22,160కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,64,900 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,52,400 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,64,900 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.