మళ్లీ పెరిగిన బంగారం.. వెండి అదే బాటలో 

  • Publish Date - October 4, 2019 / 08:06 AM IST

దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర 38వేల 300కి పెరిగింది. వెండి ధర రూ.46వేలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాములు (24 క్యారెట్లు) పసిడి ధర పైకి ఎగిసి రూ.39వేల 590కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీలమైన ట్రెండ్ కారణంగా దేశీయ డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగినట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.45800కు చేరింది. విజయవాడలో ఈ రోజు 10 గ్రాములు (24 క్యారెట్లు) బంగారం ధర రూ.39వేల 670కు చేరింది. కిలో వెండి ధర రూ.46వేలకు చేరింది. విశాఖ పట్నంలో 10 గ్రాముల (24క్యారెట్లు) బంగారం ధర రూ.36వేల 370గా రికార్డు కాగా.. కిలో వెండి ధర రూ.46వేలకు చేరింది. 

ఇక ఢిల్లీ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాములకు రూ.650 మేర తగ్గింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,300కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.37,100కు ఎగసింది. పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది.

కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.46వేలకు పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, బంగారం మార్కెట్, వాణిజ్య యుద్ధాలు పలు అంశాల కారణంగా బంగారం ధరలపై ప్రభావం పడింది.