భగ్గుమన్న బంగారం ధర : 10గ్రాములు రూ.34వేలు

బంగారం ధరలు భగ్గుమన్నాయి. పుత్తడి దర భారీగా పెరిగింది. బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్ ధరలు అత్యంత గరిష్టానికి చేరాయి. 2019, జనవరి 30వ తేదీ బుధవారం 10 గ్రాముల గోల్డ్

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 01:23 PM IST
భగ్గుమన్న బంగారం ధర : 10గ్రాములు రూ.34వేలు

Updated On : January 30, 2019 / 1:23 PM IST

బంగారం ధరలు భగ్గుమన్నాయి. పుత్తడి దర భారీగా పెరిగింది. బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్ ధరలు అత్యంత గరిష్టానికి చేరాయి. 2019, జనవరి 30వ తేదీ బుధవారం 10 గ్రాముల గోల్డ్

బంగారం ధరలు భగ్గుమన్నాయి. పుత్తడి దర భారీగా పెరిగింది. బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్ ధరలు అత్యంత గరిష్టానికి చేరాయి. 2019, జనవరి 30వ తేదీ బుధవారం 10 గ్రాముల గోల్డ్ ధర 34వేల రూపాయల మార్క్‌ను టచ్‌ చేసింది. దీంతో 8 నెలల గరిష్ట స్థాయికి చేరింది. రెండు రోజుల్లో బంగారం ధ‌ర‌లు రూ.450 పెరిగాయి. వెండి కూడా ఇదే బాటలో ఉంది. కిలో ధర 330 రూపాయలు పెరిగి 41వేల 330 రూపాయలు పలుకుతోంది.

 

కొన్ని రోజులుగా పసిడి ధర అప్‌ట్రెండ్‌లో ఉంది. అంతర్జాతీయ కారణాలు కూడా ఇందుకు కారణం. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్‌ ధోరణి కనబర్చింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర 34వేల 070 రూపాయలుగా ఉంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర 33వేల 920రూపాయలు పలుకుతోంది.

 

దేశీ జువెలర్ల నుంచి కొనుగోళ్లు పెరగడం ఇందుకు కారణం. పెళ్లి సీజన్ డిమాండ్ ఇందుకు దోహదపడింది. ఫెడ్‌ వడ్డీరేటు, అమెరికా – చైనా ట్రేడ్‌‌వార్‌ ఆందోళనలు, చైనా టెక్‌ దిగ్గజం హువావేపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంతో అనిశ్చితి ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లవైపు మొగ్గు చూపారని బులియన్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా పుత్తడి ధర పాజిటివ్‌గా ఉంది.