Gold Prices
Gold Prices : దేశంలో అక్షయ తృతీయ పండుగకు ముందు పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. మరో వారం రోజుల్లో అక్షయ తృతీయ సందడి ప్రారంభం కానుండగా.. బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకుని రికార్డులు సృష్టించాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే బంగారాన్ని కొనుగోలు చేయలేము అంటున్నారు. పెరుగుతున్న ధరలతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్నారు. వారిలో మరింత ఆందోళన పెంచుతూ బంగారం ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాములపై ఒక్కరోజే ఏకంగా 480 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ ధర గరిష్ట స్తాయికి చేరింది.
బంగారం ధర రూ.480 పెరగడంతో 10 గ్రాముల బంగారం 61వేల 780 రూపాయలకు చేరింది. వెండి సైతం కిలో రూ.410 పెరిగి రూ.77వేల 580కి చేరింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగానూ పసిడి ధరలకు రెక్కలు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 2,041 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్స్ వెండి 25.88 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.(Gold Prices)
డాలర్, బాండ్ల సూచీల క్షీణత కారణంగా బంగారం కొనుగోలుకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారని, దీంతో పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు విశ్లేషించారు. పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతీ రోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతూ ఉంటాయి.
ప్రపంచ మార్కెట్ లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. యుక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఫలితంగా ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ లో హెచ్చుతగ్గుల వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.(Gold Prices)
గోల్డ్ కి, భారతీయులకు విడదీయని అనుబంధం ఉంది. ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే ప్రాణం. కాదు కాదు పిచ్చి. చాలామంది సంపాదనలో కాస్త సేవ్ చేసుకుని ప్రతి ఏటా కచ్చితంగా పసిడి కొనడం అలవాటు. పండుగ వచ్చినా ఫంక్షన్ జరిగినా.. ఇలా అకేషన్ ఏదైనా.. అంతో ఇంతో గోల్డ్ కొనాల్సిందే. ఇక పెళ్లిళ్లలో కట్నకానుకల కింద పెద్ద మొత్తంలో బంగారం ఇస్తారు. మనోళ్లు బంగారాన్ని అలంకరణ వస్తువుగానే కాదు మంచి ప్రాఫిట్ ఇచ్చే ఇన్వెస్ట్ మెంట్ గానూ చూస్తారు. అందుకే.. ధర ఎంత ఉన్నా గోల్డ్ కొనుగోలు విషయంలో మాత్రం తగ్గేదేలే అంటారు. (Gold Prices)