Gold Rates: పండక్కి ముందే తగ్గిన బంగారం ధరలు
దీపావళి పండుగకు ముందు, పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో పెరుగుతూ పోయిన బంగారం ధర ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది.

Gold Rate (2)
Gold Rates: దీపావళి పండుగకు ముందు, పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో పెరుగుతూ పోయిన బంగారం ధర ఎట్టకేలకు తగ్గుముఖం పట్టింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి పండుగ ముందే కాస్త ఊరటనిచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బంగారం దూకుడుకు బ్రేక్ పడింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ప్రస్తుతం ధర రూ.44,850గా ఉండగా.. నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గింది. 10గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.48,930గా ఉంది. నిన్నటిలో పోల్చితే రూ.110 తగ్గింది. విశాఖపట్టణం, విజయవాడలో కూడా బంగారం ధరలు అంతే ఉన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,120గా ఉంది. ముంబైలో రూ. 47,050, న్యూఢిల్లీలో రూ. 47,000, కోల్‌కతాలో రూ. 47,350, బెంగళూరులో రూ. 44,850, కేరళలో రూ.44,850గా ఉంది. గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు ఏకంగా ఏడు సార్లు పెరగ్గా.. రెండు రోజులుగా తగ్గుతూ వస్తుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి రూ.688గా ఉంది. అదే కేజీ వెండి రూ.68,800కి లభిస్తోంది.
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
నిజానికి, బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ హాల్ మార్కులు ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750. దేశంలో అత్యధికంగా బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతోంది. ఎంత ఎక్కువ క్యారెట్ బంగారాన్ని కొనుగోలు చేస్తే, అంత స్వచ్ఛమైన బంగారం అంటారు.
22 మరియు 24 క్యారెట్‌ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల హాల్‌మార్క్ బంగారం 99.9 శాతం వరకు స్వచ్ఛమైనది. 22 క్యారెట్ బంగారం 91 శాతం స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి 9 శాతం విభిన్న లోహాలు 22 క్యారెట్ల బంగారంలో కల్తీ చేస్తారు. 24 క్యారెట్ల బంగారం పూర్తిగా స్వచ్ఛమైనది. అయితే 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయడం కష్టం అవుతుంది. అందుకే దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని అమ్ముతారు.
బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు:
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో మార్పులు.. డాలర్‌తో రూపాయి మారకం విలువ.. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.