Gold Prices Rise: బంగారం ధరకు రెక్కలు: ఒక్కరోజులో రూ.1200 పైకి

రష్యా - యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు(క్రూడ్ ఆయిల్), బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Gold Prices Rise: రష్యా – యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు(క్రూడ్ ఆయిల్), బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకి చమురు ధరలు, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు లేకపోవడం, రవాణా వ్యవస్థపై పై నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతుండడం.. రూపాయి విలువ క్షీణించడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర అమాంతం పెరిగింది. బుధవారం సాయంత్రానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1202(ఢిల్లీ మార్కెట్లో) పెరిగి రూ.51,889కి చేరింది.

Also read: Japanese for Ukraine: యుక్రెయిన్ పిలుపుకి స్పందించిన జపనీయులు: రష్యాపై పోరాటానికి 70 మంది సిద్ధం

అదే సమయంలో వెండి ధర కూడా పెరుగుతూనే ఉంది. బుధవారం కేజీపై రూ.2148 పెరిగిన వెండి ధర రూ.67,956కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $1943 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర $25.18 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర 5.43 డాలర్లు పెరిగి 110.40 డాలర్లకు చేరుకుంది. చమురు ధరల నియంత్రణ నిమిత్తం 31 దేశాలు తమ వద్దనున్న 60 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను విడుదల చేసేందుకు సుముఖంగా ఉన్నా.. మార్కెట్లో ప్రతికూల ధోరణి కారణంగా ధరల్లో పెద్దగా ఫలితం కన్పించలేదు.

Also read: PM Modi: భారత్ శక్తివంతంగా తయారవుతుంది కాబట్టే “ఆపరేషన్ గంగా” సాధ్యమైంది: మోదీ

ట్రెండింగ్ వార్తలు