Japanese for Ukraine: యుక్రెయిన్ పిలుపుకి స్పందించిన జపనీయులు: రష్యాపై పోరాటానికి 70 మంది సిద్ధం

జపాన్ కు చెందిన సుమారు 70 మంది వాలంటీర్లు యుక్రెయిన్ తరుపున యుద్ధంలో పాల్గొంటామంటూ ముందుకువచ్చారు. యుక్రెయిన్ తరుపున తలపడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు

Japanese for Ukraine: యుక్రెయిన్ పిలుపుకి స్పందించిన జపనీయులు: రష్యాపై పోరాటానికి 70 మంది సిద్ధం

Japanese

Japanese for Ukraine: యుద్ధంలో రష్యాను నిలువరించడమే లక్ష్యంగా యుక్రెయిన్ దేశం చేస్తున్న పోరాటం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్శించింది. భీకరమైన దాడులతో రష్యా సేనలు బీభత్సం సృష్టిస్తున్నా.. యుక్రెయిన్ సైన్యంతో కలిసి ఆదేశ ప్రజలు ఎదురొడ్డి నిలుస్తున్నారు. సాక్షాత్తు యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ.. యుద్ధక్షేత్రంలో దిగి..తన సైనికులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు. అదే సమయంలో వేలాదిగా వస్తున్న రష్యా సైనికులను తరిమికొట్టేందుకు తమకు మరింతమంది సహాయం చేయాలనీ జెలెన్స్కీ అర్ధించాడు. రష్యా సైన్యంతో తలపడేందుకు ఏ దేశస్తులైన యుక్రెయిన్ కు సహాయం అందించాలని..స్వచ్చందంగా యుద్ధంలో పాల్గొని తమ దేశాన్ని కాపాడాలంటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చాడు. అలా స్వచ్చందంగా ముందుకు వచ్చే యుద్ధ వాలంటీర్లకు వీసా కూడా అవసరం లేదని.. నేరుగా విమానం ఎక్కి వచ్చేయండని జెలెన్స్కీ పిలుపునిచ్చారు.

Also read: Ukraine next President: ఉక్రెయిన్ అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్ ను ప్రకటించనున్న పుతిన్? ఎవరతను?

యుక్రెయిన్ పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఉసూరుమంటున్నాయి. సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. రష్యా హెచ్చరికల నేపథ్యంలో అడుగు ముందుకు వేయలేకున్నారు. ఈక్రమంలో రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ తరుపున తలపడేందుకు మేము వస్తామంటూ కొందరు జపనీయులు సంసిద్ధత వ్యక్తం చేశారు. జపాన్ కు చెందిన సుమారు 70 మంది వాలంటీర్లు యుక్రెయిన్ తరుపున యుద్ధంలో పాల్గొంటామంటూ ముందుకువచ్చారు. వీరిలో 50 మంది జపాన్ కు చెందిన స్వీయ-రక్షణ దళాల సభ్యులు కాగా, మిగతావారు ఫ్రెంచ్ ఫారిన్ లీజియన్ లో సేవలు అందించిన వారు ఉన్నారు.

Also read: PM Boris Johnson : అతడో యుద్ధ నేరస్తుడు.. పుతిన్‌పై బ్రిటన్ ప్రధాని ఫైర్

జపాన్‌లోని యుక్రేనియన్ రాయబార కార్యాలయం బుధవారం ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. మెడికల్, ఐటి, కమ్యూనికేషన్ లేదా అగ్నిమాపకశాఖల్లో అనుభవం ఉన్న వాలంటీర్ల కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. అయితే వాలంటీర్లు స్థానికంగా ఉండి పనిచేయాలా, లేక యుక్రెయిన్ కు తరలిస్తారా అనే విషయం మాత్రం తెలియరాలేదు. మరోవైపు రష్యా – యుక్రెయిన్ యుద్ధం జపాన్‌లో తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది. యుక్రెయిన్ పై రష్యా దాడి చేయడాన్ని నిరసిస్తూ గత వారం టోక్యోలో వందలాది మంది సంఘీభావం తెలిపారు. యుద్ధ సమయంలో తమ దేశాన్ని ఆదుకోవాలంటూ యుక్రెయిన్ రాయబార కార్యాలయం సహాయం అభ్యర్దించగా.. సుమారు 60,000 మంది జపనీయులు స్పందించి $17 మిలియన్ల విరాళాలను అందించారు. మరోవైపు రష్యాపై జపాన్ కూడా భారీ ఆంక్షలు విధించింది.

Also read: Leave Kharkiv : కాలి న‌డ‌క‌న అయినా సరే వెంటనే ఖార్కివ్‌ ఖాళీ చేయండి.. భారతీయులకు హెచ్చరిక