×
Ad

Gold Rates Today: భారీగా పెరిగిన బంగారం ధర.. దీపావళికి ముందే ఆల్ టైమ్ రికార్డులు బద్దలు.. ఈ రోజు రేటు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,66,000కి చేరింది.

Gold

Gold Rates: మరికొన్ని రోజుల్లో ధనత్రయోదశి-దీపావళి ఉంది. ఆ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. బంగారం కొనుగోలు చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. అయితే, ఈ సమయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతుండడంతో కొనుగోళ్లు ఏ మేరకు జరుగుతాయన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దేశంలో పసిడి ధరలు ఇవాళ కూడా పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,370 పెరిగి, రూ.1,20,770గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.1,10,700కి చేరింది. (Gold Rates)

Also Read: అమాంతం పడిపోయిన టమాటా ధర.. కిలో ఎంతంటే? రైతులకు మిగిలేది రూ.1

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,370 పెరిగి 1,20,920గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి 1,10,850కి చేరింది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,370 పెరిగి, రూ.1,20,770గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి రూ.1,10,700కి చేరింది.

గ్లోబల్ మార్కెట్లో సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరగడంతో పాటు అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, కరెన్సీ మార్కెట్‌లో మార్పులు ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు. బంగారం కొనే వేళ స్థానిక దుకాణాల్లో మేకింగ్ చార్జీలు, హాల్‌మార్క్ వివరాలను పరిశీలించాలి. వాటి ఆధారంగా తుది ధరల్లో తేడాలు వస్తాయి.

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,66,000కి చేరింది.
  • విజయవాడలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,66,000కి చేరింది.
  • విశాఖలో కూడా కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,66,000కి చేరింది.
  • ఢిల్లీలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,56,000కి చేరింది.
  • ముంబైలో కిలో వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000 పెరిగి రూ.1,56,000కి చేరింది.