Gold Rates Today
Gold Rates Today : పెళ్ళిళ్లు, శుభకార్యాలు, పండుగలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే (Gold Rates Today). అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. అయితే, ఇటీవల కాలంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉధ్రిక్తతలు కారణంగా వీటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయితే, ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.110 తగగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. రూ.100 తగ్గింది. వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. అక్కడ ఔన్సు గోల్డ్ 10డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 3,365 వద్ద కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,01,510 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,660 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.93,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,01,510కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,31,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,21,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,31,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.