Google Pixel 7 Launch : ఆపిల్‌కు పోటీగా గూగుల్.. ఐఫోన్ 14 లాంచ్‌కు ముందే పిక్సెల్ 7 లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

Google Pixel 7 Launch : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ మొదలవుతోంది. ఆపిల్‌ (Apple)కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కూడా కొత్త పిక్సెల్ 7 ఫోన్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది.

Google Pixel 7 Launch : ఆపిల్‌కు పోటీగా గూగుల్.. ఐఫోన్ 14 లాంచ్‌కు ముందే పిక్సెల్ 7 లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

Google announces Pixel 7 launch date hours before Apple iPhone 14 announcement

Updated On : September 7, 2022 / 3:23 PM IST

Google Pixel 7 Launch : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్ మొదలవుతోంది. ఆపిల్‌ (Apple)కు పోటీగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కూడా కొత్త పిక్సెల్ 7 ఫోన్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే గూగుల్ లాంచ్ (Google Pixel 7) ఈవెంట్‌కు సంబంధించి అనేక లీక్‌లు వినిపించాయి. అయితే Google మెగా ఈవెంట్ Apple iPhone 14 లాంచ్ అయ్యే నెల తర్వాత నిర్వహించనుంది. అక్టోబర్ 6న పిక్సెల్ 7 (Pixel 7 Lineup) లైనప్‌ను అధికారికంగా ప్రకటించినట్టు Google బ్లాగ్‌లో ధృవీకరించింది. ఈ లైనప్‌లో Pixel 7, Pixel 7 Pro స్మార్ట్ ఫోన్లతో పాటు ఆసక్తికరమైన Google Pixel Watches కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న నెస్ట్ స్మార్ట్ స్పీకర్ల (Nest smart speakers)కు కూడా కొన్ని అప్ గ్రేడ్ ఫీచర్లు యాడ్ చేసే అవకాశం ఉంది.

Google announces Pixel 7 launch date hours before Apple iPhone 14 announcement

Google announces Pixel 7 launch date hours before Apple iPhone 14 announcement

Google Pixel 7 ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే?
న్యూయార్క్ నగరంలో ఈ Google Pixel 7 లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు గూగుల్ బ్లాగ్‌లో వెల్లడించింది. ఈవెంట్ GoogleStore.com/events లైవ్ టెలిక్యాస్ట్ అవుతుంది. అయితే US, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. లాంచ్‌ లేటెస్ట్ అప్‌డేట్‌లను పొందేందుకు భారత వినియోగదారులు Google సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావొచ్చు. ఈ Pixel 7 లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 6న రాత్రి 7:30 గంటలకు IST జరుగనుంది.

Google announces Pixel 7 launch date hours before Apple iPhone 14 announcement

Google announces Pixel 7 launch date hours before Apple iPhone 14 announcement

గూగుల్ లాంచ్ ఈవెంట్‌లో ఏమేమి రిలీజ్ కావొచ్చు :
గూగుల్ పిక్సెల్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్సెల్ 7 సిరీస్‌ (Pixel 7 Series)ను లాంచ్ చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో పిక్సెల్ 7 (Pixel 7), పిక్సెల్ 7 ప్రో (Pixel 7 Pro) ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లతో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్‌ (Google Pixel Smart Watch)ను కూడా గూగుల్ రిలీజ్ చేయనుంది. వాస్తవానికి, Google గత ఏడాదిలోనే పిక్సెల్ 6 (Pixel 6 Launch) లాంచ్ ఈవెంట్‌లో Google Pixel Watch లాంచ్ కావాల్సింది. కానీ, చిప్ కొరత కారణంగా అప్పట్లో పిక్సెల్ వాచ్ లాంచ్ కుదరలేదు. గూగుల్ నెస్ట్ స్మార్ట్ స్పీకర్ (Nest smart speakers) లైనప్‌ను కూడా విస్తరించాలని యోచిస్తోంది.

Google Pixel 7 సిరీస్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. ఫోటోలు, వీడియోలు, సెక్యూరిటీ, స్పీచ్ రికగ్నిషన్ వంటి అద్భుతమైన ఫీచర్‌లను తీసుకురానుంది. Google మొట్టమొదటి స్మార్ట్‌వాచ్, Pixel Watch, కూడా ఈవెంట్‌లో జరుగనుంది. కంపెనీ Google, Fitbit హెల్త్ ఫిట్‌నెస్ స్కిల్స్ ఒకేసారి లాంచ్ చేయనుంది. స్మార్ట్ వాచ్ Google మెరుగైన WearOSలో రన్ అవుతుంది. పిక్సెల్ వాచ్ అన్ని పిక్సెల్, ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పాటు పిక్సెల్ బడ్స్ ప్రో (Pixel Buds Pro) పిక్సెల్ బడ్స్ A-సిరీస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో పనిచేసేలా డిజైన్ చేసినట్టు కంపెనీ పేర్కొంది.

Read Also : Apple iPhone 14 Max : ఆపిల్ కొత్త ఐఫోన్ 14 Max మోడల్ వస్తోంది.. సెప్టెంబర్ 7న లాంచ్ అయ్యే ఛాన్స్..!