Google Messages Spam : ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ మెసేజెస్ ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

Google Messages : స్కామర్లతో జాగ్రత్త.. యూజర్లను స్కామ్‌లు, డబ్బు మోసాలు, మరిన్నింటి నుంచి గూగుల్ మెసేజెస్ ప్రొటెక్షన్ అందించగలదు. అసలు ఈ ఫీచర్ ఏమిటి. ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Google Messages Spam : ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ మెసేజెస్ ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

Google Messages ( Image Source : Google )

Updated On : October 19, 2024 / 3:46 PM IST

Google Messages Spam : ఆన్‌లైన్ స్కామర్‌లు వినియోగదారులను ట్రాప్ చేసేందుకు స్కామ్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందుకోసం అనేక పద్ధతులను ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా స్కామర్లు మెయిల్, మెసేజ్‌లు, కాల్‌ల ద్వారా యూజర్లను సంప్రదిస్తారు.

ఈ రోజుల్లో ఎస్ఎంఎస్ అత్యంత సాధారణ పద్ధతుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇప్పుడు, గూగుల్ మెసేజ్‌లు డిఫాల్ట్ ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ యాప్, ఇప్పుడు చాలా స్మార్ట్‌ఫోన్‌లు దానితో డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా వస్తాయి. గూగుల్ స్పామ్ ప్రొటెక్షన్ విషయంలో చాలా తీవ్రమైనదిగా చెప్పవచ్చు. అందుకే గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఈ ఫీచర్‌ని రూపొందించింది.

గూగుల్ మెసేజెస్ స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్ అంటే ఏమిటి? :
గూగుల్ మెసేజెస్ ఇంటర్నల్ స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్‌తో వస్తుంది. అందుకున్న అన్ని మెసేజ్‌లకు స్పామ్ ప్రొటెక్షన్ అందించడానికి రియల్ టైమ్ స్కాన్‌లను అమలు చేస్తుంది. ఈ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా పనిచేస్తుందని, ఫీచర్ పూర్తిగా ఆప్షన్ అని గూగుల్ పేర్కొంది. యూజర్లు దీన్ని వద్దని భావిస్తే ఆఫ్ చేయవచ్చు.

ఇది ఎలా పని చేస్తుంది?
గూగుల్ మెసేజేస్ అనుమానిత స్పామ్‌ ఫోల్డర్‌లో హైడ్ చేయొచ్చు. ‘Report Spam’ ఎంచుకోవడం ద్వారా మెసేజ్ స్పామ్ కాదా అని వినియోగదారులు సూచించవచ్చు. ‘Report not spam’ హెచ్చరిక కనిపించినప్పుడు. డేటా ప్రొటెక్షన్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. డివైజ్‌లోని మెషిన్ లెర్నింగ్ మోడల్‌లు రిపోర్ట్ చేయకపోతే మెసేజ్ కంటెంట్‌ను షేర్ చేయకుండా స్పామ్ ప్యాటర్న్స్ గుర్తిస్తాయి.

స్పామ్ డిటెక్షన్ ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. యూజర్ ప్రైవసీని కాపాడుతుంది. స్పామ్ ప్రొటెక్షన్ మెరుగుపరచడానికి గుర్తించలేని సమాచారంతో సహా అనామక డేటా గూగుల్‌కు పంపుతుంది. గూగుల్ ఎంపిక చేసిన మెసేజ్ వివరాలను తాత్కాలికంగా స్టోర్ చేస్తుంది. కానీ, పేర్లు లేదా ఫోన్ నంబర్ల వంటి స్థిరమైన ఐడెంటిఫైయర్‌లను నివారిస్తుంది. స్పామ్ గుర్తింపును మెరుగుపరిచే ప్రక్రియలో యూజర్ ప్రైవసీని నిర్ధారిస్తుంది.

గూగుల్ స్పామ్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేయాలంటే? :
* మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్‌ని ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ ఐకాన్ నొక్కండి. సెట్టింగ్‌లకు వెళ్లండి.
* ఇప్పుడు, ‘spam protection’ ఆప్షన్ ఎంచుకోండి.
* టోగుల్‌ని ఎనేబుల్ చేయండి.

అంతే.. ఇప్పుడు గూగుల్ మెసేజస్ కోసం స్పామ్ ప్రొటెక్షన్ ఆన్ చేసింది. యాప్ ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను ఫిల్టర్ చేస్తుంది. యూజర్ల నుంచి మాన్యువల్ ఇన్‌పుట్ అవసరం లేదు. అయితే, వినియోగదారులు ఏదైనా మెసేజ్ మాన్యువల్‌గా స్పామ్‌ అని రిపోర్టు చేసే అవకాశం ఉంది.

Read Also : iPhone SE 4 Leak : ఐఫోన్ 7 ప్లస్ డిజైన్‌తో కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 వస్తోంది.. లాంచ్‌కు ముందే కేస్ రెండర్లు లీక్..!