Google Pixel 7 series is launching in 3 weeks, here is everything we know
Google Pixel 7 Series : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ (Google Pixel) నుంచి కొత్త సిరీస్ వస్తోంది. అదే.. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Google Pixel 7 Series). ఈ స్మార్ట్ ఫోన్ రెండు మోడళ్లలో గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7), గూగుల్ పిక్సెల్ 7 ప్రో సిరీస్ (Google Pixel 7 Pro) అందుబాటులోకి రానున్నాయి. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) ఈవెంట్ విజయవంతంగా ముగిసింది.
ఇప్పుడు గూగుల్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూడాల్సిన సమయం వచ్చింది. అక్టోబర్ 6న Google లేటెస్ట్ పిక్సెల్ హార్డ్‌వేర్ ఈవెంట్ (Google Latest Pixel Hardware Event)ను హోస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, Google I/O 2022 ఈవెంట్‌కు ఇంకా 3 వారాల సమయం ఉంది. కంపెనీ లేటెస్ట్ Pixel 7 సిరీస్‌ని ప్రకటించనుంది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం మునుపటి ఈవెంట్‌లో ఈ డివైజ్ గురించి ధృవీకరించింది. రాబోయే Pixel 7 సిరీస్ గురించి ఇప్పటివరకు కొన్ని వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Google Pixel 7 series is launching in 3 weeks, here is everything we know
గూగుల్ రెండు మోడళ్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పిక్సెల్ 7 (Pixel 7 Series) పిక్సెల్ 7 ప్రో (Pixel 7 Pro Series). ఈ కొత్త డివైజ్‌లు పాత మోడళ్ల మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటాయని కంపెనీ వీడియో టీజర్ వెల్లడించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఇప్పటికీ అద్భుతమైన కెమెరా మాడ్యూల్ ఉంటుంది. Google ఇప్పుడే సెన్సార్‌ల ప్లేస్‌మెంట్‌ను మార్చేసింది. ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌తో వచ్చాయి. మూడవ కెమెరా కూడా ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్ అని చెప్పవచ్చు. పిక్సెల్ 6 సిరీస్‌తో పోలిస్తే.. ఈ ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు. వెనుక ప్యానెల్‌లో సాధారణ Google లోగోనే కనిపిస్తోంది. ప్రైమరీ మోడల్ వెనుక రెండు కెమెరాలను కలిగి ఉంది. అయితే ప్రో వేరియంట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
Google భాగస్వామ్యంలో వీడియో టీజర్‌లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ నలుపు, తెలుపు, పగడపు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో పిక్సెల్ 7 సిరీస్ ఫ్రంట్ సైడ్ రివీల్ చేసింది. మునుపటి మోడల్‌లలో మాదిరిగానే పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. పిక్సెల్ 6 కన్నా స్టాండర్డ్ మోడల్ మరింత కాంపాక్ట్‌గా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పిక్సెల్ 7Pro మోడల్ అదే స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. Pixel 7 ఫోన్ 6.7-అంగుళాల 120Hz ప్యానెల్‌తో రావచ్చు సాధారణ వెర్షన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల స్క్రీన్ ఉండవచ్చు.
Google Pixel 7 series is launching in 3 weeks, here is everything we know
Google కొత్త హై-ఎండ్ హ్యాండ్‌సెట్‌లపై Qualcomm ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని వినియోగించదు. ఈ ఫోన్ రెండు డివైజ్‌లు Google సెకండ్ జనరేషన్ టెన్సర్ చిప్‌సెట్ ద్వారా పొందవచ్చు. పిక్సెల్ 7 సిరీస్ ఆండ్రాయిడ్ 13 OS తో వచ్చే అయ్యే అవకాశం ఉంది. బ్యాటరీపై ఎలాంటి సమాచారం లేదు. కానీ, కొత్త మోడల్స్ పెద్ద యూనిట్లను అందించనున్నాయి. స్పీడ్ ఛార్జింగ్ కోసం Google కూడా సపోర్టు అందించనుందని భావిస్తున్నారు. Pixel 7, Pixel 7 Pro అదే 50-MP ఐసోసెల్ GN1 ప్రధాన కెమెరా సెన్సార్‌లను ఉపయోగిస్తాయని తెలిపారు. 12-MP సోనీ IMX381 అల్ట్రావైడ్ సెన్సార్‌కు సపోర్టు అందిస్తుంది. పిక్సెల్ 6 లైనప్‌లోనూ ఇదే మోడల్ అందుబాటులోకి వచ్చింది. Pixel 7 Proలో మరో సెన్సార్ ఉంటుంది.
Google Pixel 7 series is launching in 3 weeks, here is everything we know
48-MP Samsung GM1 టెలిఫోటో సెన్సార్ కావచ్చు. సెల్ఫీల కోసం 11-MP Samsung 3J1 సెన్సార్‌ని చూడవచ్చు. ప్రస్తుతానికి, పిక్సెల్ 7 సిరీస్ భారత్ మార్కెట్లో లాంచ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. చాలా కాలం క్రితమే భారత మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ మోడళ్లను లాంచ్ చేయడం నిలిపివేసింది. గూగుల్ ఆ మోడళ్లను ఇతర భారతీయ మార్కెట్‌కు తీసుకురావాలని భావించడం లేదు. Pixel 4, Pixel 5 మరియు Pixel 6 సిరీస్‌లు దేశంలోకి రాలేదు. బ్రాండ్ సరసమైన పిక్సెల్-A సిరీస్ ఫోన్‌ను మాత్రమే రిలీజ్ చేసింది. కొత్త పిక్సెల్ 7 సిరీస్‌ను భారతీయ మార్కెట్లో కూడా రిలీజ్ చేయాలని గూగుల్ నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వారాల తర్వాతే దీనిపై క్లారిటీ రానుంది.