Realme Narzo 50i Prime : రూ.10లోపు ధరకే రియల్‌మి Narzo 50i Prime బడ్జెట్ ఫోన్.. 4G ఫోన్లలో ఇదే బెస్ట్.. ఇప్పుడే కొనేసుకోండి!

Realme Narzo 50i Prime : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి భారత మార్కెట్లోకి Narzo 50i Prime మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది.

Realme Narzo 50i Prime : రూ.10లోపు ధరకే రియల్‌మి Narzo 50i Prime బడ్జెట్ ఫోన్.. 4G ఫోన్లలో ఇదే బెస్ట్.. ఇప్పుడే కొనేసుకోండి!

Realme Narzo 50i Prime launched in India, priced under Rs 10,000

Realme Narzo 50i Prime : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి భారత మార్కెట్లోకి Narzo 50i Prime మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది. రియల్‌మి C33 (Realme C33) స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించిన కొద్ది రోజులకే ఈ Narzo 50i Prime 4G ఫోన్ లాంచ్ అయింది. అయితే ఈ రెండు ఫోన్‌లు దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లతో వచ్చాయి. ఇందులో కెమెరా ఒకటే కొంచెం తేడా ఉంది. Realme యూజర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకమైన ఆప్షన్లతో ఫోన్లను అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

ఈ కొత్త Realme Narzo 50i Prime ధర రూ. 7,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే Realme C33 ధర రూ. 8,999గా నిర్ణయించింది. భారత మార్కెట్లోకి సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 50i Prime)గా రిలీజ్ అయింది. 3GB RAM + 32GB స్టోరేజ్ మోడల్ రూ.7,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 8,999కి అందుబాటులో ఉంది.

Realme Narzo 50i Prime launched in India, priced under Rs 10,000

Realme Narzo 50i Prime launched in India, priced under Rs 10,000

కొత్త ఎంట్రీ లెవల్ ఫోన్ డార్క్ బ్లూ (Dark Blue), మింట్ గ్రీన్ (Mint Green) కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. Amazon, Realme ఆన్‌లైన్ సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా సేల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల (Realme Narzo 50i Prime) విషయానికొస్తే 6.5-అంగుళాల LCD స్క్రీన్‌తో వస్తుంది. HD+ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ప్యానెల్ 60Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. వాటర్‌డ్రాప్-స్టైల్ నోచ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. యునిసోక్ T612 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఎంట్రీ-లెవల్ చిప్.

Realme Narzo 50i Prime launched in India, priced under Rs 10,000

Realme Narzo 50i Prime launched in India, priced under Rs 10,000

అదే.. SoC Realme C33 స్మార్ట్‌ఫోన్‌కు కూడా పవర్ అందిస్తుంది. దీనికి Mali-G57 GPU సపోర్టు కూడా ఉంది. Realme Narzo 50i Prime మైక్రో SD కార్డ్ (1TB) ద్వారా స్టోరేజీ సపోర్టును కలిగి ఉంది. ఈ కొత్త Realme ఫోన్ ఆండ్రాయిడ్ 11 OSతో వచ్చింది. గూగుల్ ఆండ్రాయిడ్ 13ని కూడా రిలీజ్ చేసింది.

హుడ్ కింద 5,000mAh బ్యాటరీ అందించారు. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందించగా.. మొత్తం డివైజ్‌లో రెండు కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ ఒకటి.. బ్యాక్ ఒకటి కెమెరా అందించారు. బ్యాక్ కెమెరా మాడ్యూల్‌లో 8-MP సెన్సార్, సెల్ఫీల కోసం 5-MP షూటర్ ఉన్నాయి.