Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?

ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లు, టాబ్లెట్‌ల దిగుమతికి సంబంధించి గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో 19.7 బిలియన్ డాలర్లు ఇండియా నుంచి బయటికి వెళ్లాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం పెరిగింది

Government of India: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతిపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. స్థానిక తయారీని ప్రోత్సహించే ప్రాథమిక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం గురువారం పేర్కొంది. ప్రభుత్వం వెల్లడించిన నోటీసు ప్రకారం.. అయితే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందినవారు మాత్రమే ఈ ఉత్పత్తులను ప్రస్తుతం దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

12 Lakhs Sunflowers Gift To wife : 50 పెళ్లిరోజు గిఫ్టుగా భార్యకు 12 లక్షల సన్‌ఫ్లవర్స్.. అంబరాన్ని అంటిన ఆమె ఆనందం

ఈ చర్య ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగమేనట ఈ నిర్ణయం. వాస్తవానికి, ఆటోమొబైల్స్ నుంచి సాంకేతికత వరకు అన్ని రంగాలలో స్థానిక తయారీని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పరికరాల దిగుమతులను అరికట్టడం ద్వారా, ప్రభుత్వం విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు స్థానిక తయారీ సామర్థ్యాల వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

IND vs WI 1st T20 Match: భారత్ కుర్రాళ్లకు సవాల్.. ఆ ఇద్దరి అరంగేట్రం ఉంటుందా? పరుగుల వరద ఖాయమంటున్న విండీస్ బ్యాటర్లు

ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లు, టాబ్లెట్‌ల దిగుమతికి సంబంధించి గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో 19.7 బిలియన్ డాలర్లు ఇండియా నుంచి బయటికి వెళ్లాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాజీ డైరెక్టర్ జనరల్ అలీ అఖ్తర్ జాఫ్రీ వంటి పరిశ్రమ నిపుణులు, ఈ చర్య స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో ప్రభుత్వ దృఢ నిబద్ధతను ప్రదర్శిస్తుందని అభిప్రాయపడ్డారు.

Kharge vs Dhankar: నాకు పెళ్లైంది, కోపం రాదు.. రాజ్యసభలో చైర్మన్ ధన్‭కడ్, విపక్ష నేత ఖర్గే మధ్య జోకులు

అయితే, ఈ చర్య Dell, Acer, Samsung, Panasonic, Apple, Lenovo, HP వంటి కంపెనీలకు పెద్ద సవాళుగా మారనుంది. ఈ సంస్థలు భారతీయ మార్కెట్లో ప్రధాన పోటీదారులు. వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి ముఖ్యంగా చైనా వంటి దేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి. తాజా పరిమితుల దృష్ట్యా, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న స్థానిక ఉత్పాదక సౌకర్యాలు లేని కంపెనీలు భారతదేశంలో సమర్థవంతంగా పనిచేయడానికి దేశంలోనే కొత్త ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పడం గురించి ఆలోచించవలసి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు