12 Lakhs Sunflowers Gift : 50వ పెళ్లిరోజు గిఫ్టుగా భార్యకు 12 లక్షల సన్‌ఫ్లవర్స్.. అంబరాన్ని అంటిన ఆమె ఆనందం

భర్త ఇష్టం తెలుసుకుంటే ఆ కాపురం సంతోషాలతో నిండిపోతుంది. భార్య మనసెరిగిన భర్త ఉంటే వారి సంసారం ఆనందంగా సాగిపోతుంది. అటువంటి ఓ భర్త తన భార్యకు నచ్చిన పువ్వులనే కాదు ఏకంగా పూల తోటనే కానుకగా ఇచ్చాడు. 12 లక్షల సన్ ఫ్లవర్స్ పూయించి భార్యకు 50వ వివాహం దినోత్సం సందర్భంగా కానుకగా ఇచ్చాడు.

12 Lakhs Sunflowers Gift : 50వ పెళ్లిరోజు గిఫ్టుగా భార్యకు 12 లక్షల సన్‌ఫ్లవర్స్.. అంబరాన్ని అంటిన ఆమె ఆనందం

Man 12 lakh sunflower gift to wife

12 lakh sunflowers gift to wife for 50th wedding anniversary : భార్య మనసెరిగిన భర్త ఉంటే ఆ భార్య జీవితం నందనవమే అవుతుంది. అటువంటి భార్యకు ఇష్టమైన అరుదైన గిఫ్టు ఇచ్చిన భర్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. 16 ఏళ్ల వయస్సులో చిరుగించిన వారి ప్రేమ నుంచి.. వివాహం చేసుకున్న 50 ఏళ్ల తరువాత కూడా భార్యను అపురూపంగా చూసుకున్నాడు. ఆమె కూడా భర్తే ప్రాణంగా జీవించింది. వారి వివాహం జరిగి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఆమెకు ఇష్టమైన సన్ ఫ్లవర్ పూలతో ఆమెను నింపేశాడు.

ఓరెండో మూడో సన్ ఫ్లవర్స్ ఇవ్వటమేంటీ.. ఏకంగా సన్ ఫ్లవర్ తోటే కానుగా ఇచ్చాడు. 80 ఎకరాల్లో సన్ ఫ్లవర్స్ పండింది. ఆ తోటలో ఆమెను నిలబెట్టి ఇదే నా చిరుకానుక అంటూ ఆర్థ్రంగా చెప్పాడు. భర్త కళ్లలో కనిపించిన ఆ అనురాగానికి అమె చలించిపోయింది. ఎప్పుడో తనకు సన్ ఫ్లవర్స్ అంటే ఇష్టమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని ఏకంగా 80 ఎకరాల్లో పండిన 12 లక్షల సన్ ఫ్లవర్ (12 lakh sunflowers) తోటనే కానుకగా ఇచ్చిన భర్తను చూసి మురిసిపోయింది. నందనవనం లాంటి పసుపు పచ్చని ఆతోటలో.. మదినిండా అనురాగం పొంగుతుంటే.. భర్తను ఆర్థ్రంగా అనురాగంగా, స్నేహంగా కౌగలించుకుని కాసేపు ఉండిపోయింది.ఆ అద్భుతమైన ఆనందం ముందు ఏవీ సాటిరావని నిరూపించాడు అమెరికాకు చెందిన లీ విల్సన్‌ అనే వ్యక్తి .

Sunflower : సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వు వెనుక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ..!

లీ విల్సన్‌ (Lee Wilson )ఓ రైతు. వ్యవసాయం అంటే ప్రాణం. తన భార్య రెనీ(Renee )కి సన్ ఫ్లవర్స్ (sunflowers)అంటే ఇష్టమని తెలుసు. ఆమెకు అరుదైన కానుక ఇవ్వాలనుకున్నాడు. తమ వివాహం జరిగి 50 ఏళ్ల పూర్తయిన (50th wedding anniversary) సందర్భంగా అతనికి ఉన్న 80 ఎకరాల్లో 12 లక్షలకుపైగా సన్‌ఫ్లవర్లను పూయించి భార్య రెనీకి బహుమతి(12 lakhs sunflowers gift to wife )గా ఇచ్చాడు.

తన భార్యకు సన్‌ఫ్లవర్‌ అంటే ఎంతో ఇష్టమని తెలుసుకున్న లీ పెళ్లి రోజు సన్‌ఫ్లవర్‌ బొకే ఇచ్చే బదులు ఏకంగా 80 ఎకరాల సన్‌ఫ్లవర్‌ తోటనే కానుకగా అందించాలని అనుకున్నాడు. అలా తన కుమారుని సాయంతో మే నెలలో సన్‌ఫ్లవర్స్‌ పూయించడం మొదలుపెట్టి.. పెళ్లిరోజు వరకూ ఆ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ పెళ్లిరోజు రానే వచ్చింది. భార్యను తీసుకొచ్చి తోట మధ్యలో నిలబెట్టి ‘‘ఇవిగో నీకిష్టమైన సన్ ఫ్లవర్స్ అన్నీ నీవే..అన్నీ నీకోసమే పూయించాను’’ అని చెప్పాడు.అంతే ఆమె మనస్సులో కోటి రంగులు విరబూశాయి. కానీ కళ్లముందు మాత్రం బంగారం రంగులో మెరిసిపోతున్ పసుపుపచ్చని పూల మధ్య ఆమె ఈ లోకాన్నే మర్చిపోయింది. భర్త కౌగిలిలో కరిగిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన లక్షల సన్ ఫ్లవర్స్ మధ్య భర్త నులువెచ్చని కౌగిలింత. ఇక ఈ జన్మకు ఈ ఆనందం చాలు అనుకుంది.

లీ,రెనీలది ప్రేమ వివాహం. 16ఏళ్లలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. స్కూలు రోజుల్లోనే ప్రేమించుకున్నారు. వారి ప్రేమను వివాహ బంధంగా మార్చుకున్నారు. అలా వారి వివాహ బంధానికి 50 ఏళ్లు నిండాయి. అలా వారి పెళ్లి రోజున ఆమను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఈ సన్‌ఫ్లవర్‌ పూలతోట సుందర దృశ్యాన్ని చూసేందుకు ఆమెను తీసుకొచ్చి తోట మధ్యలో నిలబెట్టాడు. ఈ పూల తోటను చూసిన ఆమె ఎంతగానో మురిసిపోతూ వివాహ వార్షికోత్సవ వేళ తనకు ఇంతకుమంచిన పెద్ద బహుమతి మరొకటి ఉండదు అని తెలిపింది.

Ukrainians freezing Sperm : రష్యాపై యుద్ధానికి ముందు స్పెర్మ్‌ భద్రపరిచిన యుక్రెయిన్ సైనికులు..భర్త దూరమైనా తల్లి కానున్న వీర సైనికుడి భార్య..

సాధారణంగా అమెరికాలాంటి పాశ్చత్య దేశాల్లో ఇంతకాలం వివాహం బంధంలో ఉండటమేఅరుదు. చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకునే దేశంలో కూడా 50 ఏళ్ల వివాహ బంధంలో రెనీ, లీలు అన్యోన్యంగా జీవించటం విశేషం.