Govt Business: ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు.. బల్ల గుద్ది మరీ చెప్పిన మారుతీ చైర్మన్

అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్యలే గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం వస్తుందని, అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రైవేటీకరణ తోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు. వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని స్పష్టం చేశారు

Govt Business: ప్రభుత్వం వ్యాపారాలు చేయొద్దంటే చేయొద్దని మారుతీ సుజుకి చైర్మన్ ఆర్.సీ.భార్గవ బల్ల గుద్ది మరీ చెప్పారు. దీనికి ఆయన చూపించిన కారణం.. ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవని, ప్రారంభమైన నాటి నుంచి పని చేసే క్రమంలో మూసి వేసే వరకు సైతం పూర్తిగా ప్రభుత్వం సమకూర్చే నిధులపైనే ఆధారపడి ఉంటాయని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇక్కడ వాస్తవం ఏంటంటే.. ప్రభుత్వం నడిపే కంపెనీలకు అంత సమర్ధత ఉండదు. వాటి నుంచి ఉత్పత్తి ఉండదు. లాభాలను ఆర్జించలేవు. కనీసం వసతులైనా ఉత్తత్పి చేయలేవు. అవి పైకి లేవవు. ప్రతి సమయంలో ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వ కంపెనీలు ఏవైనా సొంతంగా వనరుల్ని సంపాదించుకుని పని చేస్తున్నాయా? అన్నింటికీ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలి’’ అని భార్గవ అన్నారు.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

అంతర్గతంగా వనరుల్ని ఉత్తత్తి చేసుకుంటేనే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భార్గవ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ రంగ సంస్థలు సంపదను సృష్టికర్తలు కావు. సంపద సృష్టికి అనుకూలంగా లేకపోతే ఏ కంపెనీ అయినా నష్టాలవైపే వెళ్తుంది. ఇలాంటి అసమర్థమైన పనికి పన్ను చెల్లింపుదారుల నుంచి డబ్బును వెచ్చిస్తున్నారు. దీని వల్ల దేశం నష్టపోతుంది’’ అని అన్నారు.

అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్యలే గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే నష్టం వస్తుందని, అందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రైవేటీకరణ తోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు. వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని స్పష్టం చేశారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టంచేశారు.

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

ట్రెండింగ్ వార్తలు