IND Vs PAK Match: మరికొద్దిసేపట్లో దాయాది జట్ల మధ్య పోరు.. ఆ ముగ్గురిలో జడేజా ప్లేస్‌ ఎవరికి..?

చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్ - భారత్ జట్ల మధ్య మరోసారి రసవత్తర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. గాయం కారణంగా ఆల్ రౌండర్ జడేడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్ లో జడేజా స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరిని తుదిజట్టులోకి తీసుకుంటాడన్న అంశం ఆసక్తికరంగా మారింది.

IND Vs PAK Match: మరికొద్దిసేపట్లో దాయాది జట్ల మధ్య పోరు.. ఆ ముగ్గురిలో జడేజా ప్లేస్‌ ఎవరికి..?

Pakistan vs india Match

IND Vs PAK Match: చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్ – భారత్ జట్ల మధ్య మరోసారి రసవత్తర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దాయాది దేశంపై విజయంతో జోష్ మీదన్న టీమిండియా మరోసారి పాక్ ను మట్టికరిపించేందుకు సిద్ధమైంది. అయితే టీమిండియాకు జడేజా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం జడేజా స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Asia Cup 2022: భారత్ జోరు కొనసాగేనా..! నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ.. వారు రాణిస్తే భారత్‌ విజయం సునాయాసం ..

జడేజా బ్యాటింగ్‌తో పాటు, స్పిన్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పగలిగే సత్తాఉన్న ఆటగాడు. ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే స్పిన్ బౌలింగ్‌తో పాటు ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, అశ్విన్, దీపక్ హుడాలు ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది క్రీడాభిమానుల్లో ఆసక్తికర చర్చసాగుతుంది. పాక్ పై భారత్ మరోసారి విజయం సాధించాలంటే స్పిన్ విభాగం బలోపేతం ఉండాలి. ప్రస్తుతం ప్రధాన స్పిన్నర్ చాహల్ జట్టులో ఉన్పప్పటికీ గత రెండు మ్యాచ్ లో సత్తా చాటలేక పోయాడు.

Mushfiqur Rahim: టెస్ట్‌లు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు..! టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ క్రికెటర్

ఇలాంటి తరుణంలో అశ్విన్, దీపక్ హుడాల్లో ఒకరిని ఎంచుకొనే అవకాశముంది. మరో సీనియర్ స్పిన్నర్ తప్పనిసరి అనుకుంటే అశ్విన్ కు జట్టులో చోటుదక్కే అవకాశం ఉంది. మరోవైపు పంత్ నుకూడా పాక్ – ఇండియా మ్యాచ్ లో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జట్టులో వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్ ఉన్నారు. మరోవైపు రాహుల్ సైతం కీపింగ్ చేయగలడు. అయితే రాహుల్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతుండటంతో రాహుల్ స్థానంలో పంత్ ను తీసుకొని ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందన్న ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు సమాచారం. అలాకాకుంటే కార్తీక్ ను పక్కనపెట్టి పంత్ ను ఆడించే యోచనలో రోహిత్ ఉన్నాడట. మరి జడేజా స్థానంలో అశ్విన్, హుడాల్లో ఎవరిని జట్టులోకి తీసుకుంటారు? పంత్ కు 11మంది జట్టులో చోటు దక్కుతుందా  అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్దిసేపు ఆగాల్సిందే.