Export Of Wheat Flour, maida: గోధుమ పిండి, మైదా, సెమోలినా, తదితర ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్ర సర్కారు నిషేధం
ఇప్పటికే గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గోధుమ పిండి, మైదా, సెమోలినా, తదితర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ఇప్పుడు నిషేధం విధించింది. ఈ మేరకు నిన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. గోధుమ పిండి, మైదాపై ఎగుమతులపై నిషేధం విధించాలని.. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సమావేశం (సీసీఈఏ)లో నిర్ణయించిన విషయం తెలిసిందే.

Export Of Wheat Flour, maida
Export Of Wheat Flour, maida: ఇప్పటికే గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గోధుమ పిండి, మైదా, సెమోలినా, తదితర ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ఇప్పుడు నిషేధం విధించింది. ఈ మేరకు నిన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. గోధుమ పిండి, మైదాపై ఎగుమతులపై నిషేధం విధించాలని.. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సమావేశం (సీసీఈఏ)లో నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటే వాటి ఎగుమతులు చేసుకోవచ్చని పేర్కొంది. గోధుమ పిండి, మైదా ధరలను కట్టడి చేయడానికి ఎగుమతులపై ఈ పరిమితులు విధిస్తున్నట్లు చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా గోధుమ పిండి, రవ్వ, మైదా, తదితర ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో విదేశాల్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
విదేశాలకు గోధుమపిండి ఎగుమతులను తగ్గించాలని, అలా చేస్తే భారత్ లో గోధుమ పిండి ధరలు దిగివస్తాయని అధికారులు ఇటీవల ప్రభుత్వానికి సూచించారు. భారత్ నుంచి రష్యా, ఉక్రెయిన్‌కు గోధుమ పిండి అధికంగా ఎగుమతి అవుతుది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఆయా దేశాల్లో భారత గోధుమ పిండికి మరింత డిమాండ్ పెరిగింది. దీంతో కొన్ని వారాలుగా భారత్ లో గోధుమ పిండి ధరలు పెరిగిపోతున్నాయి.