Online Shopping Charges
Online Shopping Charges : ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? హిడెన్ ఛార్జీలతో జాగ్రత్త.. ఈ అదనపు ఛార్జీలపై వినియోగదారులను ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లేదా జెప్టో నుంచి ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.
మీరు ఏదైనా ప్రొడక్టును డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే (Online Shopping Charges) సమయంలో మీకు కనిపించని అదనపు ఛార్జీలు కూడా పడతాయి. ముందుగా కార్ట్ యాడ్ చేసినప్పుడు ఒక విధంగా ఛార్జీలు ఉంటాయి. అన్ని రుసుములను కలిపిన తర్వాత అసలు ధరను చెల్లించాల్సి వస్తుంది.
ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా వినియోగదారులపై అదనపు ఛార్జీలను విధిస్తున్నాయి. కస్టమర్లను మోసం చేసేందుకు అనేక బ్రాండ్లు డార్క్ ప్యాటర్న్ అనే ట్రిక్ అప్లయ్ చేస్తుంటాయి. దాంతో వినియోగదారులు చెల్లించాల్సిన ఫైనల్ బిల్లు అమాంతం పెరిగిపోతుంది. అయితే, దీనికి పరిష్కారం లేదా అంటే ఉందనే చెప్పాలి. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌ల మోసాలపై ఫిర్యాదు చేసేందుకు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. ఇటీవలే, భారత ప్రభుత్వం డ్రిప్ ధరల కుంభకోణానికి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది.
డ్రిప్ ప్రైసింగ్ ఏంటి? :
ఉదాహరణకు.. మీరు ఒక ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అన్ని డిస్కౌంట్లతో రూ. 6వేలకి హెడ్‌ఫోన్ చూశారనుకుందాం.. ఇప్పుడు, మీరు ఆ హెడ్‌ఫోన్ కార్ట్‌కు యాడ్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ధర రెండు వందల లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. అది మీకు డ్రిప్ ధర. ఈ అదనపు ఛార్జీలు మొదట యూజర్లకు కనిపించకుండా హైడ్ అవుతాయి.
అదనపు ఛార్జీలపై డార్క్ ప్యాటర్న్‌లు ఏంటి? :
మీ ఆన్‌లైన్ కార్ట్ నిర్దిష్ట ధరను చూపుతుంది. మీరు చెక్అవుట్ చేయగానే ప్లాట్‌ఫామ్ సర్వీస్ ఛార్జ్ వంటి అదనపు ఛార్జీలు యాడ్ అవుతాయి.
జీఎస్టీ తగ్గింపు ఉంటుంది. కానీ, మీరు ఒక ప్రొడక్టుకు చెల్లిస్తున్న ధరకు యాడ్ కాదు.
మీరు సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేయండి. ఆపై అసలు విలువకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత యాడ్ అవుతుందో చూడొచ్చు.
డెలివరీ ఛార్జీ లేని ప్రమోషన్ డీల్ ఇన్‌వాయిస్‌లో అదే చూడవచ్చు.
కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు కంప్లయింట్ చేయడం ఎలా? :
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం అంత సులభం కాదు. మీరు 1915కు కాల్ చేసి, ప్రొడక్టు, డ్రిప్ ధరలను చూపించే ప్లాట్‌ఫామ్‌పై ఫిర్యాదును రిజిస్టర్ చేయాలి. ఏదైనా సమస్యలపై ఫిర్యాదు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆన్‌లైన్ కొనుగోళ్లపై జరిగే అదనపు ఛార్జీల భారాన్ని నివారించవచ్చు.