Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్‌ ముగుస్తోంది.. ఇంకా ఒక్కరోజు మాత్రమే.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డీల్స్ మీకోసం.. డోంట్ మిస్

Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో శాంసంగ్, రియల్‌మి, నథింగ్, వివో నుంచి స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు పొందవచ్చు.

Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్‌ ముగుస్తోంది.. ఇంకా ఒక్కరోజు మాత్రమే.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డీల్స్ మీకోసం.. డోంట్ మిస్

Flipkart Diwali Sale

Updated On : October 23, 2025 / 3:22 PM IST

Flipkart Diwali Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్, వివో, నథింగ్ వంటి బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను (Flipkart Diwali Sale) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో అందుబాటులో ఉన్న టాప్ ఆఫర్లపై ఓసారి లుక్కేయండి..

శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ :
ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ ధర రూ.59,999 ఉండగా రూ.30వేల వరకు తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ సమయంలో కేవలం రూ.29,999కే విక్రయిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.

ఎక్సినోస్ 2400e ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీని అందిస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP + 12MP + 5MP బ్యాక్ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Read Also : Samsung Galaxy A55 5G : శాంసంగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

వివో V50e 5G :

ఈ మిడ్-బడ్జెట్ ఫోన్ వివో నుంచి రూ.33,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ.24,649 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో రూ.23,416కు కొనేసుకోవచ్చు. 6.77-అంగుళాల FHD+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్ వరకు256GB వరకు స్టోరేజీతో సపోర్ట్ అందిస్తుంది. ఈ వివో ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,600mAh బ్యాటరీని కలిగి ఉంది.

నథింగ్ ఫోన్ (3a) :
నథింగ్స్ మిడ్-బడ్జెట్ ఫోన్ నథింగ్ ఫోన్ (3a) ధర భారీగా తగ్గింది. రూ. 24,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన ఈ నథింగ్ ఫోన్ రూ. 3వేలు తగ్గింపు ధరకు లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ. 21,999 నుంచి బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో సహా అనేక పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది.

రియల్‌మి 15 ప్రో :
ఈ సేల్‌లో రియల్‌మి 15 ప్రో ఫోన్ కేవలం రూ.28,999 ప్రారంభ ధరకే లభిస్తుంది. అద్భుతమైన ఆఫర్లతో లభిస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 50MP డ్యూయల్ కెమెరా, 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. 7,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.