Samsung Galaxy A55 5G : శాంసంగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A55 5G : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసినప్పటీ ఈ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఇప్పుడు రూ. 16వేల భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ఆకర్షణీయమైన ధరకు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఎంత తొందరగా కొనేసుకుంటే అంత బెటర్..

శాంసంగ్ గెలాక్సీ A55 5G అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A55 5G రూ.39,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.23,999కి లిస్ట్ అయింది.

ఈ-కామర్స్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై రూ.16వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

హుడ్ కింద గెలాక్సీ A55 5G ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో అమర్చి ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది.

ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది.