Nirmala sitharaman
GST Council Meeting: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జీఎస్టీ రేట్ల మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సెప్టెంబరు 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు చేయాలని నిర్ణయించారు. 5, 18 శాతం స్లాబ్‌లను మాత్రమే కొనసాగిస్తారు. 12, 28 శాతం స్లాబ్‌లు తొలగిస్తారు. లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను ఉంటుంది.
అంతకుమందు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని చాలా మంది విశ్లేషకులు అంచనాలు వేశారు. ఫీడింగ్ బాటిల్స్, కార్పెట్లు, గొడుగులు, సైకిళ్లు, వంట పాత్రలు, ఫర్నిచర్, పెన్సిల్స్, జ్యూట్ లేదా పత్తితో చేసిన హ్యాండ్‌బ్యాగ్స్, రూ.1,000 లోపు ఫుట్‌వేర్‌ను 12 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబ్‌కి తీసుకురావచ్చని భావించారు
Also Read: మరి అప్పుడు ఎందుకు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయలేదు?: సీతక్క
కండెన్స్‌డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, ఫ్రోజెన్ కూరగాయలు, సాసేజ్‌లు, పాస్తా, జామ్‌లు, నంకీన్స్ కు సంబంధించి 12 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబ్‌కి తీసుకురావచ్చని భావించారు. (GST Council Meeting)
గ్రోసరీలు, ఆహారం, పండ్లు, కూరగాయలు, మందులు, టూత్‌పౌడర్, ఎలక్ట్రానిక్స్ (ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు), వ్యవసాయ పరికరాలు, సైకిళ్లు, ఇన్సూరెన్స్, విద్యా సేవలు వంటి వాటి ధరలు తగ్గవచ్చు.
సాధారణ ప్రజలు, రైతులకు ఊరటనిస్తూ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 175 వస్తువులపై పన్ను తగ్గింపు ప్రతిపాదనలు ఉన్నాయి. 8 రంగాలు లాభపడే అవకాశం ఉంది. టెక్స్‌టైల్, ఎరువులు, రిన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, హ్యాండీక్రాఫ్ట్స్, వ్యవసాయం, ఆరోగ్యం, ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ లాభం పొందుతాయి.